
‘తప్పులు మానవ సహజం. తప్పు చేశామనే భావనతో కుంగిపో వాల్సిన పనిలేదు. దాన్ని కూడా ఒక లెసన్‍గా తీసుకుంటే ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అంటోంది రకుల్‍ప్రీత్ సింగ్. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ షూటింగ్‍లో పోర్చుగల్‍లో ఉన్న ఆమె ‘తెలుగుపత్రిక’తో చేసిన చిట్ చాట్..
మీ సినీ జర్నీలో ఆటుపోట్లు ఉన్నాయా?
ఆటుపోట్లు ఉండకపోతే సక్సెస్‍ను ఇంతగా ఆస్వాదించే దానిని కాదేమో. నా సినీ ప్రయాణంలో అన్నీ ఉన్నాయి. విజయాన్ని ఎంజాయ్ చేయాలంటే పరాజయం ఎలా ఉంటుందో కూడా అనుభవంలోకి రావాలి కదా!.
కెరీర్ ప్రారంభంలో ఏమైనా పొరపాట్లు చేశానని ఇప్పటికీ ఫీలవుతున్నారా?
ఎవరి కెరీర్‍లోనైనా ఆరంభంలో చిన్న చిన్న పొరపాట్లు సహజమే. నా వృత్తిలోనూ అది భాగమే. మొదట్లో చాలా తప్పులు చేశాను. కానీ అవెందుకు చేశానా అని ఎప్పుడూ బాధపడలేదు. వాటిని కూడా ఒక లెస్సన్‍గా తీసుకోవడం వల్ల వాటి నుంచి చాలా నేర్చుకోగలిగాను.
ప్రస్తుతం మీకున్న స్టార్‍డమ్‍ను ఎంజాయ్ చేస్తున్నారా?
ఈ స్టార్‍డమ్ ఊరకనే రాలేదు. తొలినాళ్లలో సినిమాకు సంబంధించి నాకేమీ తెలియదు. దాంతో కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆ నిర్ణయాలు తొలి అడుగుల్లోనే బోలెడన్ని విషయాలు నేర్చుకోవడానికి కారణమయ్యాయి. కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీ.
తప్పులనుంచి పాఠం నేర్చుకున్నానంటున్నారు. అంటే ఇక తప్పులు చేయడం లేదా?
లేదు. ఇప్పుడు ఏది కరెక్ట్?, ఏది కాదు? అని నిర్ణయించుకునే అనుభవం వచ్చింది. ప్రస్తుతం నేను టాలీవుడ్‍లో, కోలీవుడ్‍లో అగ్రస్థానానికి చేరుకోవడానికి అవే దోహదపడ్డాయి. తప్పులు జరిగిపోయాయే అని బాధ పడుతూ కూర్చుంటే ఏం చేయలేం.
Review తప్పు చేయడం తప్పేం కాదు.