ధర్మానిదే విజయం

ఆంధప్రదేశ్‍ శాసనసభ, లోక్‍సభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‍కల్యాణ్‍ వంద శాతం స్ట్రైక్‍ రేట్‍తో విజయకేతనం ఎగురవేశారు. ఆయన పార్టీ సాధించిన ఘన విజయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ మంచి జోష్‍ నింపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్‍కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఓజీ’ చిత్ర బృందం కొత్త పోస్టర్‍ను విడుదల చేసింది. అందులో పవన్‍ చలువ కళ్లద్దాలు పెట్టుకుని, స్టైలిష్‍గా కుర్చీలో కూర్చుని కనిపించారు. ‘ఎవ్వరికీ అందదు అతని రేంజ్‍. రెప్ప తెరిచేను రివేంజ్‍’ అంటూ ఆ పోస్టర్‍పై ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. సుజిత్‍ దర్శకత్వంలో ‘ఓజాస్‍’ అనే గంభీరమైన పాత్రలో పవన్‍ కనిపించనున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను తిరిగి ప్రారంభించేందుకు యూనిట్‍ సన్నాహాలు చేస్తోంది. అలాగే, పవన్‍ నటిస్తోన్న మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి కూడా ‘ధర్మందే విజయం’ అంటూ ఓ పోస్టర్‍ విడుదలైంది.

Review ధర్మానిదే విజయం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top