నిద్ర లేకుండా చేసేవాడు

దర్శకుడు రాజమౌళి, యువ నటుడు జూనియర్‍ ఎన్టీఆర్‍ (తారక్‍) సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. రాజమౌళిని తారక్‍ ముద్దుగా ‘జక్కన్న’ అని పిలుస్తాడు. అంటే, తాను రూపొందించే సినిమాలను అంత తదేక దీక్షతో తీర్చిదిద్దుతాడని అలా పిలుస్తాడు. అసలు విషయానికి వస్తే.. దర్శకునిగా రాజమౌళి పదిహేనేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఎడిటింగ్‍ అసిస్టెంట్‍గా కెరియర్‍ ప్రారంభించిన రాజమౌళి మొత్తం సినీ పరిశ్రమలో ఇరవై అయిదేళ్ల ప్రస్థానాన్ని.. దర్శకుడిగా పదిహేనేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. దర్శకుడిగా రాజమౌళి తొలి సినిమా జూనియర్‍ ఎన్టీఆర్‍ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్‍ నంబర్‍ 1’. ఈ సినిమా 2000 సంవత్సరం సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ సందర్భంగా రాజమౌళి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ‘స్టూడెంట్‍ నంబర్‍ 1’ షూటింగ్‍ సమయంలో నాకు, తారక్‍కు స్విట్జర్లాండ్‍లో ఒకటే గది కేటాయించారు. నేనేమో రాత్రి 9 గంటలకే నిద్రపోయేవాడిని. తారక్‍ రాత్రి 2 గంటల వరకు టీవీ చూసేవాడు. ఆ టీవీలో ఆ సమయంలో రోజూ వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమం స్విస్‍ భాషలో వస్తుండేది. నాకు నిద్ర పట్టేది కాదు. ఆ విషయం గుర్తుకొస్తే తారక్‍ను ఇప్పటికీ తిట్టూకుంటూ ఉంటా’ అని రాజమౌళి అంటూ ఉంటారు. ఆ సినిమాకు నా దర్శకత్వ అనుభవం అంతంతే అని కూడా రాజమౌళి చెప్పడం విశేషం. రాజమౌళి పదిహేనేళ్ల దర్శకత్వ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తారక్‍ మాట్లాడుతూ ‘నా జక్కన్న దేశంలోనే గౌరవనీయ దర్శకుడిగా గుర్తింపు పొందడం నాకు గర్వకారణం. ఆయన ఇంకా ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేయాలి’ అని ఆకాంక్షించారు.

Review నిద్ర లేకుండా చేసేవాడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top