బాలకృష్ణ-క్రిష్‍ మరోసారి..

బాలకృష్ణ – క్రిష్‍ జాగర్లమూడి కాంబినేషన్‍లో మరో సినిమా రానుందని ఎప్పటి నుంచో వినవస్తోంది. అది త్వరలోనే నిజం కానుంది. ఈ సినిమా ఎప్పుడు, ఎలా చేయాలనే విషయమై బాలకృష్ణ ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. త్వరలోనే గోపీచంద్‍ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. అది మొదలైన కొన్ని రోజులకే క్రిష్‍ దర్శకత్వంలోని సినిమానూ పట్టాలెక్కించాలనే ప్రణాళికలో బాలకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో ఇదివరకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో పాటు ఎన్టీఆర్‍ బయోపిక్‍పై రెండు సినిమాలు రూపుదిద్దుకున్నాయి. ఈసారి ఓ ఫాంటసీ కథలో వీరిద్దరి సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఇది ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా ఉంటుందా? లేక మరో కథనా అనేది తెలియాల్సి ఉంది.

Review బాలకృష్ణ-క్రిష్‍ మరోసారి...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top