సినిమా బాగుంటే చాలు.. రెండో మాట లేకుండా ముఖంపైనే ప్రశంసించేస్తాడు మహేశ్‍బాబు. విశాల్, సమంత, అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన అభిమన్యుడు జూన్ 1న విడుదలైన విషయం తెలిసిందే. రిలీజైన నాటి నుంచి ఈ సినిమా హిట్ టాక్‍తో బాక్సాఫీస్ బద్దలుకొడుతోంది. విదుడలైన మొదటి పద్దెనిమిది రోజుల్లోనే పద్దెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసిందీ చిత్రం. ఇటీవలే ఈ సినిమాను చూసిన మహేశ్‍బాబు.. సినిమా చాలా బాగుంది అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘అభిమన్యుడు చూశాను. చాలా బాగుంది. మిత్రన్ ఓ విజన్‍తో చక్కగా తెరకెక్కించారు. రిసెర్చ్తో, ఫాస్ట్ స్క్రీన్‍ప్లేతో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంది’ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. సినిమా బాగుంటే చాలు పెద్ద హీరోనా, చిన్న హీరోనా అని చూడరని, బహిరంగంగా ప్రసంశిస్తారని మహేశ్‍బాబుకు పేరు. ఇప్పుడు అదే జరగడంతో అభిమన్యుడు చిత్ర యూనిట్ సంబరపడుతోంది. ‘నేను నిర్మించిన చిత్రానికి మహేశ్‍బాబు వంటి సూపర్ స్టార్ ప్రశంసలు దక్కడం కిక్ ఇచ్చింది’ అని అభిమన్యుడు చిత్ర నిర్మాత హరి అన్నారు. ‘నా మొదటి సినిమానే సూపర్‍హిట్ కావడం, మహేశ్ బాబు ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అని అభిమన్యుడు చిత్ర దర్శకుడు సీఎస్ దర్శకుడు పీఎస్ మిత్రన్ సంతోషం వ్యక్తం చేశారు.
మహేశ్ మెచ్చిన అభిమన్యుడూ

Review మహేశ్ మెచ్చిన అభిమన్యుడూ.