పదేళ్ల తరువాత వచ్చినా.. తన ‘మెగా పవర్’ ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నంబర్ 150’ ద్వారా నిరూపించిన మెగాస్టార్ చిరంజీవి.. తదుపరి సినిమాలకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించగా విడుదలైన ఖైదీ నంబర్ 150 తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఆయన అభిమానులు తాజాగా ఆయన నటించిన సినిమాలతో కూడిన ఓ గేమ్‍ను విడుదల చేశారు. ఇది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి నటించిన 150 చిత్రాల్లో ప్రతి చిత్రాన్నీ ప్రేక్షకులకు తెలియ చెప్పాలనే ఉద్దేశంతో ‘మెగా 150- బాస్ ఇన్ గేమ్’ను రూపొందించారు. చిరంజీవి అభిమానులు సతీష్‍బాబు ముత్యాల, ప్రసాద్ బొలిశెట్టి, పవన్ కొర్లపాటి, శేషు స్థాపించిన ‘ఎం యాప్ స్టోర్స్ డెవలప్‍మెంట్ కంపెనీ’ ఈ గేమ్‍ను తయారు చేసింది. ‘ఈ గేమ్‍లో 14 లెవల్స్ ఉంటాయి. రెండు వాల్యుమ్స్ కింద విడుదల చేస్తున్నాం. చిరంజీవి గారి 110 చిత్రాలను మొదటి వాల్యూమ్‍లో, మిగతా 40 చిత్రాలను రెండో వాల్యూమ్‍లో క్రియేట్ చేశాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ గేమ్ డౌన్‍లోడ్ చేసుకోవచ్చు’ అని ఈ గేమ్ రూపకర్తలు చెబుతున్నారు. చిరంజీవి అభిమానులు ఇప్పటికే పెద్దసంఖ్యలో ఈ గేమ్‍ను డౌన్‍లోడ్ చేసుకున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి సినిమాలతో కాదు.. గేమ్‍లతోనూ మెగాస్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కాగా, చిరంజీవి నటించబోయే 151వ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ళ తరువాత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 151 సినిమాకు సంబంధించి సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన మనసులో ఎన్నాళ్లుగానో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నారు. దీని స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. కథ ఏదైనా.. ఆయన తరువాతి చిత్రం సురేందర్‍రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుందని టాక్
మెగా గేమ్

Review మెగా గేమ్.