
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఏమిటి? ప్రేక్షకులు, అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. విజయ్ కొత్త సినిమా పేరేమిటి? కథ ఎలా ఉంటుంది? అంటూ సోషల్ మీడియాలో ఒకటే ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ ప్రశ్నకు జవాబు దొరకనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాన్ని చేయడానికి అంగీకారం కుదిరింది. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా చేయనుంది. సూర్యదేవర నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల వివరాలను ఇటీవలే ప్రకటించారు. ‘నిశ్శబ్ద కిరీటం రాజు కోసం వేచి చూస్తోంది..’ అనే లైన్‍తో కిరీటంతో కూడిన ఓ పోస్టర్‍ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా పేరు, టీజర్ అందరూ గర్వపడేలా ఉంటుందని విజయ్ దేవరకొండ ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న చిత్రమిది. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాజు ఎవరో, కిరీటం ఎవరిదో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే!
Review ‘రాజు’ కోసం ఎదురుచూపు.