
కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే కంటే ముందే ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది రామాయణం సినిమా. రామాయణం కథాంశంగా భారీ చిత్రాల నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్ర కలిసి భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రాముడిగా హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకోన్ నటిస్తారని సమాచారం. అయితే రావణుడి పాత్రకు ప్రభాస్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బాహుబలి, సాహో చిత్రాల ద్వారా ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రభాస్.. ఈ పాత్రకు సరిగ్గా ఫిట్ అవుతాడని అంటున్నారు. మరి, ఈ సినిమాలో రావణుడి పాత్రను పోషించడానికి ప్రభాస్ అంగీకరిస్తారా? లేదా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Review రాముడెవరు? రావణుడెవరు?.