‘రైతుల పేరుతో ఊరకే డైలాగులు చెప్పడం కాదు. వసూళ్లలో ఎంతో కొంత రైతులకు ఇస్తేనే సంతోషం. నేను నటించిన ‘అభిమన్యు’ సినిమాపై తెగే ఒక్కో టికెట్‍పై రూపాయి చొప్పున రైతులకు అందచేయాలని నిర్ణయించుకున్నా’ అని ప్రకటించాడు యువ నటుడు విశాల్. ఈయన నటించిన ‘అభిమన్యు’ తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది. ఇది తమిళం, తెలుగుతో పాటు నార్త్ ఇండియాలోనూ ఆదరణ పొందింది. ఈ ఆనందంలో విశాల్ తమిళనాడులో ఈ సినిమాకు వచ్చే ఒక్కో టికెట్‍పై ఒక్కో రూపాయి రైతులకే ఇస్తానని చెప్పి.. అలాగే చేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతిలో రైతులకు సాయం చేయనున్నట్టు ప్రకటించాడు. పేరుకు తగ్గట్టే విశాల్ తనది విశాల హృదయం అనిపించుకున్నాడు కదూ.
రైతుకు సాయం విశాల హృదయం..

Review రైతుకు సాయం విశాల హృదయం...