నిజమో కాదో తెలియదు కానీ, సమంత ఇకపై సినిమాలు చేయబోదని ఫిల్మ్నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘రంగస్థలం’ తరువాత ఈమె మరే సినిమాపై సంతకాలు చేయలేదు. దాంతో ఈ వార్తలు నిజమేననే గుసగుసలు వినిపించాయి. కానీ, అటువంటిదేం లేదు. సమంత సినిమాలకు దూరం అవుతుందన్న వార్తల్లో నిజం లేదు. తను ఇక మీదట కూడా సినిమాలు చేస్తుంది. కాకపోతే మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటుందంతే..’ అంటూ ఆమె భర్త, యువ నటుడు అక్కినేని నాగచైతన్య క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి సమంత సినీ రంగం నుంచి తప్పుకోవడం ఉత్తదేనని తేలిపోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె
‘యూ టర్న్’ సినిమాలో నటిస్తోంది. దీని తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో భర్త నాగచైతన్యతో కలిసి సమంత నటించనుంది.
సమంత ఇక చేయదట!

Review సమంత ఇక చేయదట!.