సైరాకు సుదీప్‍ సై

తన కెరీర్‍లో సినిమా అనేది ఎప్పుడూ స్పెషలేనని అంటున్నారు కన్నడ నటుడు సుదీప్‍. నా మూవీ రెగ్యులర్‍ జర్నీలో సినిమా ఎప్పుడూ సర్‍ప్రైజ్‍లు ప్లాన్‍ చేస్తుందని కూడా అంటున్నాడీయన. ఇంతకీ విషయం ఏమిటంటే మెగాస్టార్‍ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘సైరా’లో సుదీప్‍ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ మధ్య ‘ఈగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన చిరంజీవి వంటి లెజండ్‍తో నటించనుండటం తన అదృష్టమని అంటున్నారు. ‘సైరా’లో నటించే అవకాశం దక్కడం, చిరంజీవి గారితో స్క్రీన్‍ షేర్‍ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ‘ఇది నా హిస్టారికల్‍ మూవీ. చాలా ఎగ్జైటింగ్‍గా ఉంది. అదే సమయంలో కొంచెం వర్రీగా కూడా ఉంది’ అని తన మనసులోని మాటను పంచుకున్నాడీ నటుడు. నయనతార, తమన్నా కథానాయకలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‍లో ఇటీవలే సుదీప్‍ పాల్గొంటున్నాడు.

Review సైరాకు సుదీప్‍ సై.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top