నవంబర్ 2, 2021 `
జాతీయ ఆయుర్వేద దినోత్సవం
తైలాభ్యంగనం
ఆయుర్వేద శాస్త్రంలో చరకుడు తైల మర్దనం గురించి ఇలా రాశాడు.
స్పర్శనే చాధికో వాయు స్పర్శనం
చ త్వగాశ్రితమ్
త్వచశ్చ పరమోభ్యంగ
తస్మాత్తం శీలయేన్నర
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ప్రధాన అవసరమైన ఆక్సిజన్ (వాయువు) ముఖ్యమైనది. వాయువు యొక్క గ్రహణ శక్తి కేవలం ముక్కు, నోరుకే కాక చర్మాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అభ్యంగనం పరమోపకారి. ఎందుకంటే, ముక్కు, నోటితో పాటుగా శరీరం చర్మ స్వేద గ్రంథుల నుంచి కూడా ఆక్సిజన్ స్వీకరిస్తుంది. కనుక శరీరానికి నిత్యం మర్దన చేయాలి.
ముఖ్యంగా తల, చెవి, పాదాలకు మర్దన వల్ల ఎంతో లాభం కలుగుతుంది.
మన శరీరానికి అనువైన, అనుకూలమైన తైలం (నూనె)తో ఈ మర్దన చేయాలి. నెమ్మదిగా అనులోమగతిలో మర్దించడాన్ని అభ్యంగం అంటారు.
Review ఆయుర్వేదం.. ఆరోగ్యం.