ఈ క్లీనిక్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ జార్జియా నుంచి అధికారిక గుర్తింపు కూడా పొందింది. 2014 నుంచి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఈ క్లినిక్ యూఎస్‍లోనే మొట్టమొదటి సంస్థ. తామా ఆరోగ్యకేంద్రంలో తామా వలంటీర్లు, వైద్యులు కలిపి మొత్తం 2,500 మంది వైద్యసేవలు అందిస్తున్నారు. 2014 నుంచి 2017 వరకు అంటే గత మూడేళ్లలో తామా క్లీనిక్.., పేషెంట్లకు నాణ్యమైన చికిత్స నందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది. తామా అందిస్తున్న ఈ ఉచిత వైద్యశిబిరం ద్వారా డాక్టర్లు అందించే వైద్య సేవలు, వలంటీర్లు పేషెంట్లపై నిస్వార్ధమైన సేవతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అంతేకాదు తామా క్లినిక్ పబ్లిక్ హెల్త్ జార్జియా డిపార్ట్మెంట్ నుండి అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా పొందింది. ఈ ఆస్పత్రిలో జనరల్ చెకప్స్, మధుమేహం మరియు రక్తపోటు పరీక్షలు చేస్తారు. ఇక్కడ అతి తక్కువ ధరలకే మందులు కూడా లభిస్తాయి. ఈ క్లీనిక్‍లో ప్రతి వారం ఇద్దరు డాక్టర్లు పేషెంట్లకు అందుబాటులో ఉంటారు. వీరితో పాటు సుమారు 900 మంది వలంటీర్లు పనిచేస్తారు.
ఇక ఈ క్లీనిక్ కో ఆర్డినేటర్‍గా తామా ఛైర్మన్ నగేష్ దొడ్డాక సుమారు 400 గంటల పాటు తన అమూల్యమైన సమయం కేటాయించి ఆస్పత్రి అభివ•ద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. తామా క్లినిక్‍లో అందుబాటులో ఉండే డాక్టర్ల విషయానికి వస్తే 10మంది డాక్టర్లు నిరంతరం పర్యవేక్షి స్తుంటారు. వీరంతా సర్టిఫైడ్ డాక్టర్లే. డా. శ్రీహరి మాలెంపతి, డా. శ్రీహరిదాస్ కాన్నూరు, డా. శైలారెడ్డి, డా. మీనా వుడలి, డా. చరిత సూర్య దేవర, డా. బాబు రాజేందప్రసాద్ మాలెంపతి, డా. ఆనంద మాధురి చుండూరి, డా. నిఖిల రాల్, డా. నందిని సుజిరెడ్డి, డా. జ్యోతి గుందావర్‍లు ఉండగా.. వీరితో పాటు తామా సర్టిఫైడ్ వలంటీర్లు నగేష్ దొడ్డాక, శ్రీనివాస్ లావు, భరత్ మద్దినేని, మహేష్ పవార్, వినయ్ మద్దినేని, మురలి బొద్దు, ప్రతియ బలుసు, రాజేష్ జంపాల, రాజు మండపాటి,రాంకీ చౌదరప్ప, సుబ్బారావు మద్దలి, వెంకీ గద్దె, రామ్ బండ్రెడ్డి, మనోజ్ తాటికొండ, వెంకట్ అడుసుమిల్లి, రాజేష్ తాడికమ్మల, ఇన్నయ్య యెనుముల, ప్రభాకర్ కడియాల, రామ్ మద్ది, ప్రభాకర్ కడియాల, ఆదిత్య గాలి, భతర్ అవిర్నేని, శివరామ్ దేవభక్తునిలు సర్టిఫైడ్ వలంటీర్లుగా పనిచేస్తున్నారు.
సేవ్‍లైఫ్ పేరుతో తామా జూలై 29న రక్తదాన శిబిరాన్ని స్థానిక అల్ఫారెట్టా ప్రజా గ్రంధాలయంలో నిర్వహించింది. తామా ఛైర్మన్ నగేష్ దొడ్డాక, తామా డైరెక్టర్లు సంయుక్తంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తామా చేస్తున్న సేవలకు గాను అపూర్వ నేమల రెండేళ్ల పాటు స్వఛ్ఛందంగా సేవలందించేందుకు ముందుకు వచ్చారు. తామా కమ్యూనిటీ కోసం ఏదైనా చేయలన్న తపనతో వలంటీర్‍గా ఉండి స్వచ్ఛందంగా సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసిన వాళ్లం అవుతామన్నారు. చాలామంది పేషెంట్లు, క్యాన్సర్ బాధితులు, రోడ్డు ప్రమాద బాధితులు లాంటి వారికి ఈ రక్త దానం చాలా ఉపయోగపడు తుందన్నారు. ఈ రక్తదాన శిబిరానికి నగేష్ దొడ్డాక, ఆదిత్య గాలి, మురళి బొద్దు, హర్ష యెర్నేని, శ్రీనివాస్ నేమల తదితరులు పాల్గొ న్నారు. అలాగే ఈ రక్తదానం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు క•షిచేసిన శ్రీనివాస్‍లావు, స్పాన్సర్‍గా వ్యవహరించిన లైఫ్స్ సౌత్‍టు హోస్ట్ఎ బ్లడ్‍డ్రైవ్‍కు ప్రత్యేక క•తజ్ఞతలు తెలిపారు.
Review తామాయా క్లినిక్ లో ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు.