మనసు మాట వింటే ఆరోగ్యం మీ వెంటే !

జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవట! నిజంగా ఎంత నిజం! అవును! ఆరోగ్యం పేరుతో రకరకాల ఆహార పరిమితులు మనకు మనం విధించుకుని.. అది తింటే ఆరోగ్యం.. ఇది తింటే అనారోగ్యం అంటూ లెక్కలేసుకుని, చివరకు తినడం కోసమే పుట్టామన్నట్టు పోషకాల పేరుతో వివిధ రుచులను పొందుతూ అదే ఆరోగ్యకరమైన జీవనం అన్నట్టు జీవిస్తున్న అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమిది. ఎందుకంటే, మనం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు ఆహారం కారణం కాదు. మనం జీవించే విధానమే మన ఆరోగ్య రహస్యం అంటున్నారు జపాన్ వైద్య పరిశోధకులు. మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలూ దరి చేరవని తేల్చిచెబుతున్నారు
అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు తేలింది. మనసు కలత బారితే లేనిపోని ఆలో చనలు చోటుచేసుకుని వాటి నుంచి బయట పడ టానికి బలహీనతలను పెంచుకోవడం (మనసు బాగోలేదని మద్యం తీసుకోవడం, సిగరెట్లు, డ్రగ్స్ పుచ్చుకోవడం వంటివి) చాలా సాధారణ విష యంగా మారిపోయింది. చివరకు అలా చేసుకున్న దురలవాట్లకు బానిసలైపోవడం వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.
అందుకే డయాబెటిక్, బీపీ వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిని మార్చుకుంటున్నారు. ఇది వరకు అది తినకూడదు, ఇది తినవచ్చు అన్న డాక్టర్లు అన్నిరకాల ఆహార పదార్థాలను నిరభ్యం తరంగా తినమని సూచిస్తు న్నారు. అది వరకు ఆకలితో మాడిపోవద్దన్న వారు ఇప్పుడు ఉపవాసాలు చేయాలని చెబుతున్నారు. పొద్దు పొద్దునే లేచి, ఏ గుడికో, గోపురానికో వెళ్లి ఆలయం చుట్టూ వీలైనన్ని ఎక్కువ ప్రద క్షణాలు చేయాలని సలహా ఇస్తున్నారు. నవ గ్రహాల మండపం చుట్టూ తిరిగే వారు. ఇదివరకు తొమ్మిది సార్లు తిరగమనేవారు. ఇప్పుడు అర్చకులు 27 ప్రదక్షణలు చేయాలని చెబు తున్నారు.
నిజానికి ఇలా చేయడం వల్ల పుణ్యానికి పుణ్యం.. ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయాన్నే వాకింగ్కు వెళ్లే వారు ప్రశాంతమైన మూడ్లో ఉండాలని, అందుకోసం నచ్చిన పాటలు వినాలని చెబు తున్నారు.
ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే, మరికొందరు జిమ్కు వెళ్లాలని అనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్ వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్ట్రెయిర్ కేస్ వాక్ చేయాలని అనుకుంటారు. అందుకని డాక్టర్లు పేషంట్ల ఇష్టానికే ఆయా వ్యాయామాలను విడిచి పెట్టి రోజులో మాత్రం ఎంతోకొంత వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు.
డాక్టర్లు అందిస్తున్న చికిత్స విధానాలలో అక స్మాత్తుగా ఎందుకింత మార్పు? ఆధునిక వైద్య చికిత్స పద్ధతుల విషయంలో వైద్యుల వైఖరి ఇలా మారడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగు చూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తవి. ఈ పరి శోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నా రంటే..
మానసిక ఒత్తిడితో గ్యాస్ ప్రాబ్లమ్
కడుపులో గ్యాస్ పేరుకుపోవడానికి గ్యాస్ ట్రబుల్గా వ్యవహరిస్తారు. గ్యాస్ అంటే వాయువు. ఇది రావడానికి, ముదరడానికి కారణం.. ఆహార లోపాల వల్ల కాదని తాజా అధ్యయనంలో తేల్చారు. మానసిక ఒత్తిడి ఎక్కువ కావడం వల్లే కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుందని అంటు న్నారు.
ఆవేశకావేశాలతో అధిక రక్తపోటు
ఉప్పు అంటే.. అమ్మో రక్తపోటు ముప్పు అంటూ హడలిపోయే వారు చాలామందే ఉన్నారు. కానీ, ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశకావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో తేలింది. కోపం వల్ల శరీరం, అందులోని నాడీ వ్యవస్థ ఉద్రేకం చెందుతుంది. రక్త ప్రసరణలో వేగం పెరుగుతుంది. అదే రక్త పోటు సమస్యకు దారి తీస్తుంది.
అతి బద్ధకంతో చెడు కొలెస్టరాల్
కొవ్వు పదార్థాలు తీసుకునే వారి కంటే, కనీస శారీరక శ్రమ చేయకుండా అతి బద్ధకంగా జీవితం గడిపేవారిలోనే కొవ్వు ఎక్కువ పెరుగు తోందట. ఎక్కువ టీవీ చూడటం, ఎక్కువసేపు ఒక్కచోటనే కూర్చుని ఉండటం, కనీసం శారీరక శ్రమ చేయకపోవడం వంటి సమస్యల వల్లనే శరీరంలో చెడు కొలెస్టరాల్ ఎక్కువగా పేరుకు పోతోందని జపాన్ వైద్య బృందం తేల్చింది.
‘షుగర్’కు స్వార్థమే కారణం
తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో డయాబెటిక్ (మధుమేహం- షుగర్) సమస్య తలెత్తుతుందని అనుకుంటాం. కానీ, మనసులో అధిక స్వార్థం, ఈర్ష్య, మొండితనంతో బాధపడు తున్న వారే ఎక్కువగా ఈ రుగ్మత బారిన పడు తున్నారని తేల్చారు.
ఆస్తమా.. అతి విచారంతో తస్మాత్ జాగ్రత్త
ఆస్తమా అనేది శ్వాసకోశ సమస్య. ఊపిరి తిత్తులకు గాలి సరిగా అందకపోవడం వల్ల శ్వాస తీసుకునే విషయంలో ఉక్కిరిబిక్కిరి కావడం ఆస్తమా లక్షణం. కానీ, నిరంతరం ఏదో విష యమై చింతించడం, బాధపడటం, అతి విచారం వల్ల శ్వాస తీసుకునే పక్రియలో మార్పులు చోటుచేసుకుని, తద్వారా ఊపిరితిత్తులు కుంచించు కుపోతాయి. ఈ కారణంగానే ఆస్తమా వస్తుందని, పలువురిపై చేసిన పరిశోధనల ద్వారా తేల్చారు.
ప్రశాంతత: గుండె జబ్బులు
ధమనుల్లో రక్త ప్రసరణ లోపాల వల్ల సాధా రణంగా గుండెజబ్బులు వస్తుంటాయి. అయితే, మనసులో ప్రశాంతత లోపించడం వల్ల ధమ నులు, సిరలు కుంచించుకుపోతున్నాయని తాజా పరిశోధనల్లో గుర్తించారు. మనిషిలో ప్రశాంతత లోపిస్తే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులే హృదయ సంబంధ రుగ్మతలకు దారి తీస్తున్నాయని తేలింది.
అన్నిటికీ మూల కారణం మనసే..
మొత్తమ్మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్ల కంటే కూడా, జీవనశైలి సంబంధంగానే ఆయా రుగ్మతలు వస్తున్నాయని అర్థమవుతోంది. ఇందుకు జపాన్ వైద్య పరిశోధక బృందం వివిధ కారణాలను చూపించింది. వారి అధ్యయనం ప్రకారం..
ఆధ్యాత్మిక భావాలు లోపించడం వల్ల 50 శాతం మంది వివిధ ఆరోగ్య సమస్యలకు గురువుతున్నారు.
మానసిక కారణాలతో రుగ్మతల బారిన పడుతున్న వారు 25 శాతంగా ఉన్నారు.
సామాజిక ప్రవర్తన, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇతరులతో సంబంధ బాంధ వ్యాలు సరిగా లేని కారణంగా 15 శాతం మంది అనారోగ్య సమస్యలకు గురవు తున్నారు.
ఇక, శారీరక కారణాల వల్ల రోగాల బారిన పడుతున్న వారి శాతం 10 శాతం మాత్రమే..
జపాన్ జీవనశైలి ఆదర్శనీయం..
జపాన్లో అనారోగ్యం కలిగితే మందులు మింగడం కంటే యోగా, ధ్యానం, జెన్ పద్ధతుల ద్వారానే వారు దేహాన్ని బాగు చేసుకుంటున్నారు కడుపు మాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేవారికంటే జీవనశైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని అక్కడి శాస్త్ర వేత్తలు అంటున్నారు.
జపాన్ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, ఈర్ష్య, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను మనసు లోకి రానివ్వకూడదు.
కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సహనం, సంతోషం, సానుకూల దృక్పథం వంటి భావనలను పెంచుకోవాలి.

Review మనసు మాట వింటే ఆరోగ్యం మీ వెంటే !.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top