ఆయుర్వేద శాస్త్రానుసారం శరీరం` వాతం, పిత్తం, కఫం అనే మూడు దోషాలు, రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు, మలం, మూత్రం, స్వేదం అనే మూడు రకాల మలాలు కలిగి ఉంటుంది. వీటి సమ్మేళనమే శరీరం.
ఇవన్నీ ప్రత్యేకమైన పనులు నిర్వర్తిస్తూ ఉంటాయి.
వీటి దోషాలు ఎక్కువైతే శరీరంలో వివిధ కదలికలు అతిగా జరుగుతుంటాయి. అప్పుడు శరీరంలో అనేక మార్పులు కలిగి రోగాలు పుట్టుకొస్తాయి.
ఈ దోషాలు తగ్గినా కూడా శరీరం వివిధ మార్పులకు గురై రోగాలు వస్తాయి.
శరీరంలో వ్యాధి కానీ, బాధ కాని వచ్చినపుడు మూడు దోషాలలో ఏది వృద్ధి చెందడం వల్ల వచ్చిందో, లేదా ఏది తగ్గడం వల్ల వచ్చిందో కనుగొనాలి. తగ్గిన దానిని, పెరిగిన దానిని సమస్థితికి తీసుకురావడమే ఆయుర్వేద వైద్యంలోని కీలకాంశం.
రోగానికి తగిన ఔషధాన్ని, దోషానికి తగిన ద్రవ్యాన్ని ఉపయోగించి వైద్యం చేసినపుడు శరీరం మళ్లీ పూర్వస్థితికి వస్తుందన్న మాట.
Review శరీరం అంటే ఏమిటి?.