సూర్య నమస్కారాలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాక ఆధ్యాత్మిక వికాసం కలిగించడంలోనూ విశేషంగా పని చేస్తాయి. వీటి వల్ల కలిగే అతి ప్రధాన ప్రయోజనం- క్రమశిక్షణ. ఎలాంటి పనిలో ఉన్నా, ఎంతటి హడావుడిలో ఉన్నా ఉదయమే సూర్య నమస్కారాలు చేయడానికి పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు ఆ సమయం ఒక ‘శక్తి కేంద్రం’గా మారుతుంది. అదే చివరికి జీవనశైలికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. కేవలం పది నిమిషాల్లో ఫుల్ బాడీ వర్కవుట్ కావడం అనేది సూర్య నమస్కారాలతోనే సాధ్యమని నిస్సందేహంగా చెప్పవచ్చు.
అరగంట వెయిట్‍లిఫ్టింగ్ వల్ల 199 క్యాలరీలు, టెన్నిస్ వల్ల 232 క్యాలరీలు, ఫుట్‍బాల్ వల్ల 298 క్యాలరీలు, రాక్ క్లైంబింగ్ వల్ల 364 క్యాలరీలు, రన్నింగ్ వల్ల 414 క్యాలరీలు తగ్గితే.. పదంటే పది నిమిషాల్లో చేసే సూర్య నమస్కారాల వల్ల ఏకంగా 417 క్యాలరీలు తగ్గుతాయి.
రోజూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరంలోని రిప్రొడక్టివ్ సిస్టమ్‍కు ఎంతో మేలు కలుగుతుంది. హార్మోన్లు సమతూకంలో ఉండటమే కాక పీసీఓఎస్, పీసీఓడీ వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మీరు మీ శరీరం పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఏది మెరుగైన పద్ధతి అని అన్వేషిస్తుంటే కనుక.. రోజూ సూర్య నమస్కారాలు చెయ్యడం ఈ రోజు నుంచే ప్రారంభించండి. అవి శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపేసి, రక్త ప్రసరణకు తోడ్పడి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
పన్నెండు భంగిమల్లో చేసే సూర్య నమస్కారాలు గంటల తరబడి యోగా, ప్రాణాయామం వంటివి చేయలేని వారికి చక్కని లాభాలు కలిగిస్తాయి. ఇప్పుడు యోగాలోనే ‘పవర్ యోగా’ అంటూ కొంతమంది ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ పవర్ యోగాలోని ఆసనాలు సూర్య నమస్కారాల వంటివే.
- శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తాయి
- శరీరం యొక్క మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. శరీర ధర్మంలో సమతుల్యత ఏర్పడుతుంది..
- మహిళలకు రుతు సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
- రక్త ప్రసరణ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుంది.
- ఎముకల దృఢత్వం పెరుగుతుంది.
- వెన్నెముక బలంగా తయారవుతుంది.
- శరీరానికి చక్కని ఆకృతి ఏర్పడుతుంది.
- చక్కని నిద్ర పడుతుంది. దీనివల్ల తరచూ వచ్చే జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తీరిపోతాయి.
- శరీరంలోని అంతర్గత ఆర్గాన్ పనితీరు మెరుగవుతుంది.
- మెదడుకు మంచి రిలాక్సేషన్ కలుగుతుంది.
- శరీరంలోని అనవసర కొవ్వు కరిగిపోతుంది. శరీరానికి ఫెక్సిబులిటీ వస్తుంది.
- ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ వంటివి పెరుగుతాయి.
- జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
- ఒత్తిడి, అలసట వంటివి దూరమవుతాయి. నిస్సత్తువకు గురయ్యే పరిస్థితి ఉండదు.
- ఉద్విగ్నత, భావోద్వేగాల నుంచి బయటపడవేస్తాయి.
- జచర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మెరుపు వస్తుంది.
- శరీరంలోని విటమిన్ డీ లెవల్స్ను పెంచుతాయి.
- శరీరంలోని హార్మోన్ల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది.
Review సూర్య నమస్కారాలు- ప్రయోజనాలు.