మహేశ్‍బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‍లో వస్తున్న మూడో చిత్రం ‘గుంటూరు కారం’. పేరుకి తగ్గట్టే మా గుంటూరు కారం యమా ఘాటుగా ఉంటుందని చెబుతున్నాయి సినీ వర్గాలు. మహేశ్‍బాబు కథానాయకుడిగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల కాగా, అభిమానుల విశేష ఆదరణ చూరగొంది. తాజాగా మహేశ్‍బాబు పుట్టినరోజును పురస్కరించుకుని కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేశ్‍బాబు పూర్తి మాస్ అవతారంలో కనిపించడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టు ద్వితీయార్థం నుంచి చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తాం. సంక్రాంతి సందర్భంగా 2024, జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని చిత్ర బృందం ప్రకటించింది.
గుంటూరు కారం

Review గుంటూరు కారం.