‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్. ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. వరుస చిత్రాలతో బిజీగా మారిన ఈమె.. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘యేషనాగుల కట్ట మీద..’ స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి ప్రేక్షకుల చేత కూడా డ్యాన్స్ చేయించింది. అలాగే వైవిధ్యభరిత చిత్రం ‘డోరతి’తోనూ ఇటీవలే ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గురించి చెప్పిన సరదా కబుర్లు..
నాని, నేను మంచి స్నేహితులం. ఆ స్నేహమే ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్ చేసేందుకు కారణమైంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తన జడలు ముట్టుకుంటే మాత్రం నానికి సుర్రుమనేది. యేషనాగుల కట్ట మీద.. పాటలో ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కలిపి సుమారు వెయ్యి మంది వరకు పాల్గొని ఉంటారు. ఈ పాట చిత్రీకరణ భలే సందడిగా సాగిపోయింది.
యోగా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగేందుకు ఇది దోహదం చేసింది. అందుకే యోగాను నా దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నాను. ఇప్పుడిప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాననే ఫీలింగ్ ఏర్పడుతోంది.
హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక మెరుపులు మెరిపిస్తున్నాను. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్దన’, అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాను.
అయితే, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రీమేక్ అనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ మల్టీస్టారర్ సినిమాపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది అనిల్ సొంతంగా రాసుకున్న వైవిధ్యభరితమైన కథ. ఇందులో ఆయన మార్క్ పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని చెప్పగలను. వచ్చే సంక్రాంతికి విడుదలవుతోన్న ఈ సినిమా చూసిన తరువాత మీరే ఆ విషయం చెబుతారు.
కెరీర్ మొదట్లో ఫిట్‌నెస్‌పై అవగాహన ఉండేది కాదు. జిమ్‌కు వెళ్లడం నా వల్ల కాదు అని అనుకునేదాన్ని. ‘మహానటి’ తరువాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను. కష్టపడి బరువు తగ్గితే, ‘బలహీనంగా కనిపిస్తున్నావు. సర్జరీలు చేయించుకున్నావా?’ అని కొందరు అడగడంతో చాలా నిరాశకు గురయ్యాను.
తల్లిదండ్రుల ప్రభావంతోనే నేను సినీ రంగంలోకి అడుగుపెట్టాను. 2000 సంవత్సరంలో బాలనటిగా తెరంగేట్రం చేశాను. 2013లో మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్గా పరిచయం అయ్యాను.
ఇక, ఈ నవంబరు 20న ‘సత్యవాన్ సావిత్రి’ చిత్రం విడుదల అవుతోంది. ఇందులో నేను లాయర్ పాత్రను పోషించాను. తెలుగులో కూడా ఈ సినిమా విడుదలవుతోంది.
నా కెరీర్లో గుర్తుండిపోయే క్షణాలు చాలా ఉన్నాయి. ఒకసారి ఓ సినిమా కోసం నిద్రపోకుండా నలభై ఒక్క గంటల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేశాం. అయినా నేను అలసిపోలేదంటే కారణం నేను అభ్యాసం చేసే యోగానే.

































































































































































































































































Review నేను శైలజ.