నానా పటేకర్‍ ఇకలేరు

విలక్షణ నటనతో.. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీప్రియులను అలరించిన దిగ్గజ నటుడు నానా పటేకర్‍ (75) గుండెపోటుతో కన్నుమూశారు. హీరో.. విలన్‍.. సామాన్యుడు.. పాత్ర ఏదైనా తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఆ పాత్రలోని సంఘర్షణతో ప్రేక్షకులను కట్టి పడేయడం నానా ప్రత్యేకత. మాటల్లో పదును, చూపుల్లో తీవ్రత, హావభావాల్లో సహజత్వం.. ఇవన్నీ కలగలిపి ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అక్టోబరు 8న గోవాలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస వదిలారు. సలాంబాంబే, పరిందా, ప్రహార్‍, తిరంగా, ఖామోషీ, అపహరణ్‍, వెల్‍కమ్‍, రాజ్‍నీతి, నటసామ్రాట్‍ వంటి చిత్రాలతో ఆయన భారతీయ చిత్రరంగంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేశారు.

Review నానా పటేకర్‍ ఇకలేరు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top