దీపావళికి విడుదలవుతున్న సినిమాల

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ వరుస విజయాలతో కళకళలాడుతోంది. ఈ దీపావళికి వెండితెర మరింత వెలుగులు పంచనుంది. దీపావళికి విడుదలవుతున్న సినిమాల జాబితా చూస్తే అసలు సిసలు వినోదాల జాతర ఖాయమని అనిపిస్తోంది. నవంబరులో దీపావళి సందర్భంగా బాక్సాఫీస్‍ బరిలో భారీ సందడి కనిపించనుంది. ఈ వరుసలో మొదట నిలిచే సినిమా- ‘రామాయణ: పార్ట్ 1’. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల లిస్టులో దీనిదే అగ్రస్థానం.
నితేష్‍ తివారి తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్‍ చిత్రంలో రాముడిగా రణ్‍బీర్‍ కపూర్‍ నటించగా, సీత పాత్రను సాయిపల్లవి పోషించింది. రావణుడిగా ‘కేజీఎఫ్‍’ స్టార్‍ యశ్‍ అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్‍.. అందులో కనిపించిన వీఎఫ్‍ఎక్స్ హంగులు ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఇది రేపు తెరపైనా ఇదే స్థాయిలో ప్రభావం చూపించిందంటే కనుక భారీ వసూళ్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్‍ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ మ్యాజిక్‍ సాధ్యమవుతుందా? లేదా అనేది నవంబరు 6న తేలిపోనుంది.

తమిళ కథానాయకుడు సూర్య ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు. ఆయన నటించిన ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‍ అండ్‍ సన్స్’ ఒకదానిని మించి మరొకటి భారీ వసూళ్లతో బాక్సాఫీస్‍ను షేక్‍ చేశాయి. ఇప్పుడిదే జోష్‍లో ఈ దీపావళికి ‘సీన్‍’ అనే మరో కొత్త సినిమాతో సినీ ప్రియులను పలకరించనున్నాడు. ‘ఆవేశం’ ఫేమ్‍ జీతూ మాధవన్‍ తెరకెక్కించిన చిత్రమిది. దీనిపై ఇప్పటికే అటు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో సూర్య హ్యాట్రిక్‍ హిట్‍ కొడతారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఈ సినిమా కూడా నవంబరు 6న విడుదలవుతోంది.
ఇక, ఈసారి దీపావళికి నేరుగా తెలుగు నుంచి రానున్న చిన్న సినిమా ‘హత:’. యువ హీరో కిరణ్‍ అబ్బవరం నిర్మించిన చిత్రమిది. విభిన్నమైన హారర్‍ థ్రిల్లర్‍ కాన్సెప్ట్తో ముస్తాబైన ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబరు 6నే విడుదల చేస్తున్నారు.
ఇంకా దీపావళి బరిలో నిలిచే సినిమాల్లో ఆసక్తి పెంచుతున్న చిత్రం- నయనతార మరోసారి అమ్మవారి పాత్రలో నటిస్తోన్న ‘మూకుత్తి అమ్మన్‍ 2’. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో ఇది విడుదల కానుంది. ఇందులో నయనతారతో పాటు రెజీనా, దునియా విజయ్‍ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్‍ దర్శకుడు సుందర్‍.సి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయన కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆరేళ్ల క్రితం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుత్తి అమ్మన్‍’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ‘మూకుత్తి అమ్మన్‍2’పై ఆసక్తి నెలకొంది.
దీపావళి ముంగిట వెండితెర సందడి ఇలా ఉండగా.. ఈ ఏడాది చివరిలో వచ్చే క్రిస్మస్‍ పండుగ కూడా బాక్సాఫీస్‍కు అదిరిపోయే ముగింపునిచ్చే సీజనే. ఇది కూడా కీలక సమయమే కావడమే పలు చిత్రాలను విడుదల చేసేందుకు మరికొందరు నిర్మాతలు యత్నాలు చేస్తున్నారు. అందుకే ప్రతి సంవత్సరం రెండు మూడు భారీ సినిమాలైనా క్రిస్మస్‍కు థియేటర్లలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్‍100’ చిత్రాలు తలపడనుండటం అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ‘వీరసింహారెడ్డి’ విజయం తరువాత బాలయ్య- గోపీచంద్‍ మలినేని కలయికలో రూపొందుతున్న రెండో చిత్రమే ‘దాదా’. ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‍స్టర్‍ డ్రామాగా దీన్ని రూపుదిద్దుతున్నారు.
మరోవైపు నాగార్జున ‘కింగ్‍100’పైనా ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‍ ఏర్పడింది. ఇది ఆయనకు వందవ సినిమా కావడం.. ఇందులో విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నట్టు జరుగుతున్న ప్రచారం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ రెండు సినిమాలతో నాగ్‍, బాలయ్య బాక్సాఫీస్‍ బరిలో ఎలాంటి మ్యాజిక్‍ చేస్తారనేది చూడాలంటే డిసెంబరు 24 వరకు వేచి ఉండాల్సిందే. ఇక, బాలీవుడ్‍ అగ్రహీరో షారూఖ్‍ఖాన్‍ ‘కింగ్‍’ కూడా అదే రోజు థియేటర్లలోకి వస్తోంది.

Review దీపావళికి విడుదలవుతున్న సినిమాల.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top