రెబల్‍స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ని ముగించే పనిలో ఉన్నారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇమాన్వి కథానాయిక. మిథున్ చక్రవర్తి, అనుపమ్‍ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది., నిజానికి ఈ డిసెంబరులోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. చిత్రీకరణ ఆలస్యంలో వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కావచ్చని అంటున్నారు. అదే జరిగితే ప్రభాస్ మరో సినిమా ‘స్పిరిట్’ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం.

































































































































































































































































Review మార్చిలో ‘ఫౌజీ’!.