దహీ బూందీ
కావాల్సినవి: శనగపిండి బూందీ- అరకప్పు, పెరుగు-
1 కప్పు, చాట్ మసాలా- పావు టీ స్పూన్,
జీలకర్ర పొడి (వేయించి పొడి చేసు
కోవాలి)- అర టీ స్పూన్, కారం పొడి-
పావు టీ స్పూన్, మిరియాల పొడి- పావు
టీ స్పూన్, కొత్తిమీర తరుగు- 1 టేబుల్
స్పూన్, పుదీనా ఆకులు- ఆరు (6), ఉప్పు- తగినంత.
త•యారు చేసే విధానం: ముందుగా బూందీని గోరు వెచ్చని నీళ్లలో ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి. ఆపైన బూందీని బయటకు తీసి, నీళ్లను పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బౌల్‍లోకి పెరుగును తీసుకోవాలి. దాంట్లో బూందీని వేసి కలపాలి. ఆపైన చాట్ మసాలా, ఉప్పు, కారం, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇప్పుడు చివరిగా పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. వేసవిలో ఈ దహీ బూందీని పిల్లలకు పెడితే, భలేగా ఇష్టంగా లాగిస్తారు.
పాస్తా సమోసా
కావాల్సినవి:
మైదాపిండి – 2 కప్పులు, నెయ్యి- పావు కప్పు, ఉడికించిన పాస్తా- అర కప్పు, ఉప్పు- తగినంత, చీజ్ – పావు కప్పు, టమాటో పేస్ట్- 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్- 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్- 1 టీ స్పూన్, కారం పొడి- పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు- పావు కప్పు, నూనె- సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా మైదా పిండిలో నెయ్యి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఆపైన సరిపడా నీళ్లు పోసి మృదువుగా వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‍పై మూకుడు పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక టమాటో పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేసి మళ్లీ కలపాలి.
ఓ నిమిషం తరువాత ఉప్పు, కారం వేసి మళ్లీ కలపాలి. ఒక రెండు నిమిషాల తరువాత స్టవ్‍ను ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో చీజ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. తరువాత పక్కన పెట్టుకున్న పిండిని, కొద్ది కొద్దిగా తీసుకుని చపాతీ కర్రతో రుద్దుకోవాలి.
వాటి మధ్యలో పాస్తా మిశ్రమాన్ని పెట్టి, మీకు నచ్చిన ఆకారంలో మడుచుకోవాలి. తర్వాత వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఏదైనా చట్నీ లేదా సాస్‍తో సర్వ్ చేసుకోవాలి.
Review సూపర్ డిష్.