పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

ఏమి చేయుచుంటివి?
ఏమి చేయుచుంటివి?
పాట పాడుచుంటిని.
ఏమి పాట?
మంచి పాట
ఏమి మంచి?
మాట మంచి
ఏమి మాట?
నీతి మాట
ఏమి నీతి?
నడక నీతి
ఏమి నడక?
గొప్ప నడక
ఏమి గొప్ప?
సేవ గొప్ప
ఏమి సేవ?
దేశ సేవ.

సెలవులు వస్తే..
సెలవులు వచ్చాయంటే చాలుస
చలపతి ఎప్పుడు ఆ•లాడును
సోమరిపోతై తిరుగుచుండును
చదువుసంధ్యలను మరచిపోవును
పాఠశాలలు తెరిచే వరకు
పాఠాలన్నీ మరచిపోవును
మొద్దబ్బాయిగ మిగిలిపోవును
అందరిలోన చులకన పొందును
అందుకని మరి అందుకనీ
సెలవు రోజులలో పాఠాలన్నీ
శ్రద్ధతో చదువుచు ఉండాలి
సాయంత్రము తగిన వేళలో
ఆటలు మంచివి ఆడాలి

బొర్ర బావ
బావా! బావా! ఓ బావా!!
బొర్రను గలిగిన మా బావా!
ఎత్తుగ ఉన్న నీ బొజ్జ
ఎంతో ముద్దుగ ఉంటుంది
కాగుల ఉన్న నీ బొర్ర
కనులకు విందు కలిగిస్తుంది
నీవు నవ్వితే ఓ బావా
బొర్ర ముద్దుగా ఊగేను
నీవు నడిచితే ఓ బావా
బొర్ర ముద్దుగా కదిలేను
నీ బొర్ర కింద ఓ బావా
చక్కగ గుడిసె వేయొచ్చు
నీ బొర్ర కింద ఓ బావా
హాయిగ కాపురముండచ్చు
బావా బావా ఓ బావా!
బొర్రను గలిగిన మా బావా!
ఎండలు బాగా కాస్తున్నాయి
నా తల మాడిపోయెను బావా
బొర్ర బావా బొర్ర బావా
బొర్ర బావా
రావా రావా ఇటురావా
నీ బొర్ర కింద నిల్చుని ఉంటే
ఎండ నుంచి రక్షణ కలిగేను
ఎంతో చల్లగ ఉండేను
బొర్ర బావా బొర్ర బావా
బొర్ర బావా
రావా రావా ఇటురావా

జీవన గీతం.. సంగీతం
జూన్‍ 21, మంగళవారం, 2022
ప్రపంచ సంగీత దినోత్సవం

భారతీయ సంగీతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి.. కర్ణాటక, హిందుస్తానీ సంగీత సంప్రదాయాలు.
కర్ణాటక సంగీతం: చెవులకు ఇంపైనది ఏదైనా కర్ణాటక సంగీతమే. ఇది దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణి. దీనినే దాక్షిణాత్య సంగీతమనీ అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకాలైన సంగీత రూపాలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, పామర రంజకంగా ఉంటాయి.
హిందుస్తానీ సంగీతం: సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు వ్యాప్తిలో ఉన్న హిందుస్తానీ సంగీతమైంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాలలో వినిపించే సంగీత పక్రియ. దీనిలో అనేక బాణీలు ఉన్నాయి.
భక్తి సంగీతం: ఇందులో భక్తిరసం ప్రధానం. వివిధ వాగ్గేయకారుల పద్యాలు, భజనలు, కీర్తనలు ఇందులో ఉంటాయి.
కాలక్షేప సంగీతం: శ్లోకాలు, కీర్తనలను మేళవించి పాడే పాటలను కాలక్షేప సంగీత పక్రియ అంటారు.
నాట్య సంగీతం: శాస్త్రీయ నృత్యాలలో తెర వెనుక వినిపించే సంగీతమిది.
జానపద సంగీతం: జనం నాలుకల నుంచి పుట్టినదే జానపద సంగీతం. సినిమా సంగీతం ఈ కోవలోనిదే.

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top