డల్లాస్లో అట్టహాసంగా TPAD బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ… తెలంగాణ రాష్ట్ర పండుగ. తీరొక్కపూలతో చేసే పండుగ. తెలంగాణ పీపుల్‍ అసోసియేషన్‍ ఆ•• •డల్లాస్‍ ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్క•తికి ప్రతీక అయిన ఈ బతుకమ్మ పండుగను టెక్సాస్‍లోని ఫిస్కో డాక్టర్‍ పెప్పర్‍ అరీనాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా బతుకమ్మను రంగురంగుల పూలతో ఒక వరుసలో పేర్చి కింద కాస్తా వెడల్పుగా.. పైకి వెళ్లే కొద్ది చిన్నగా అంటే త్రిభుజాకారంలో బతుకమ్మలు తయారుచేశారు. ఈ బతుకమ్మను పేర్చడానికి ముఖ్యంగా గునుగు, తంగేడు, గుమ్మడి పూలు, గుమ్మడి ఆకులు ఇంకా రకరకాల పువ్వులు వాడారు. బతుకమ్మను తయారు చేసిన తర్వాత మహిళలు, యువతులు అందరూ ఒక్కచోట చేరి మధ్యలో బతుకమ్మలను పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. కొత్త దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టు ఆడపడుచులు చేసే సందడి చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. మరోవైపు బతుకమ్మ పండగతో పాటు దసరా వేడుకలను సైతం ఘనంగా నిర్వహించారు. జమ్మిచెట్టుకు పూజలు చేసి ఒకరినొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పలు సాంస్క•తిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు, యువతీయువకుల డాన్స్ పోగ్రామ్స్ కన్నులవిందు చేశాయి. ఇదిలాఉంటే అర్ధరాత్రి వరకు జరిగిన సంబరాలకు వచ్చిన వారికి అన్నిరకాల వసతి సౌకర్యాలను కల్పించారు. డాక్టర్‍ పెప్పర్‍ అరీనాలో జరిగిన ఈ సంబురాలకు వేలాది మంది ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.
డల్లాస్‍లో బతుకమ్మ పండుగ కొన్నేళ్ల క్రితం లెవిస్విల్లేలో ప్రారంభమైంది. అప్పట్లో స్థానికంగా ఉండే మహిళలు ఈ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునేవారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది బతుకమ్మ పండుగకు ఆధరణ పెరగడం.. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండటంతో బతుకమ్మ పండగను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పీపుల్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు బతుకమ్మ పండగను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సారి జరిగిన బతుకమ్మ వేడుకలు డల్లాస్‍లోని అరేనా ఇండోర్‍స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగాయి. వందలాది మంది తెలుగు ఆడపడుచులు బతుకమ్మ, గౌరి దేవిని తయారు చేసి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో ఇతర తెలుగు సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఇదిలాఉంటే తెలంగాణ సంస్క•తి, సంప్రదాయాలను మరింత పెంపొందించేందుకు తెలంగాణ పీపుల్‍ అసోసియేషన్‍ ఆఫ్‍ డల్లాస్‍ (TPAD) సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ సభ్యులు, ట్రస్టీలు, ఎగ్జిక్యూటీవ్‍ కమిటీ అందరూ కలిసి ఈ వేడుకలను నిర్వహిస్తారు. అలాగే తెలంగాణ సంస్క •తి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి పండగను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఉపేందర్‍ తెలుగు, అజయ్‍ రెడ్డి, రావు కల్వాలా, రఘువీర్‍ బందరు, జానకిరామ్‍ మండది, మహేందర్‍ కమిరెడ్డి, రాజ్యవర్ధన్‍ గోందిలు తెలంగాణ సంస్క•తి సంప్రదాయాలను ప్రవాసాంధ్రులకు చాటి చెబుతున్నారు.

Review డల్లాస్లో అట్టహాసంగా TPAD బతుకమ్మ సంబరాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top