పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ ,
జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం
అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..
హాయి హాయి
ఆపదలు గాయి
హాయిహాయనగాను ఆపదలు గడుచు
చిన్న వారలగాచు శ్రీవేంకటేశు ।।హాయి।।
రావె రావె పిట్ట రత్నాలపిట్ట
కర్రదేవే పిట్ట కనకణ్ణి కొట్ట ।।హాయి।।
వాసాల మీదది మీసాలపిల్లి
అబ్బాయిచేతిది హంసల్లగిలక ।।హాయి।।
జోలపాపడికి జోడుంగరాలు
చిన్ని నా బిడ్డకు పమిడుంగరాలు ।।హాయి।।
చిన్నారి పొన్నారి చిరుతడవు నీవు
పొన్న మానుమీది చిన్నికృష్ణుడవు ।।హాయి।।
ఆడితే ముద్దమ్మ పాడితే ముద్దు
అందరికి అబ్బాయి అల్లారుముద్దు ।।హా।।
ఏకులరాటమ్ము ఇంటికందమ్ము
మా చిన్ని అబ్బాయి మాకు అందమ్ము ।।హా।।
ఉసిరికాయల తోట ఊరికందమ్ము
ఉత్తముడబ్బాయి మాకు అందమ్ము ।।హా।।
చిన్నారి పొన్నారి చిలుకవే నీవు
గున్న మామిడి మీది చిన్ని కోకిలవే ।।హా।।
జోలల్లు పాడితే బాలలకు నిద్ర
నాగస్వరం ఊదితే నాగులకు నిద్ర ।।హా।।
జోలలకు జొన్నకూడు బాలలకు వరికూడు
ఏడ్చేటి అబ్బాయికి ఎల్లావుల పాలు ।।హా।।
ఆ యింటి సందులో యీ యింటి సందులో
అలచంద పూవలె మెరసెనబ్బాయి ।।హా।।
ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి
ఏడిస్తే నీ కండ్లు నీలాలు కారు ।।హా।।
నీలాలు కారితే నేనోర్వలేను
పాలైన కారవే బంగారు కనుల ।।హా।।
ఊరెల్లతిరిగేటి ఓ ఊరుబిల్లీ
ఊరుకున్నబ్బాయికి ఉగ్గెట్టిబోవే ।।హా।।
పాడెల్ల తిరిగేటి ఓ పల్లగాడ్దె
పండుకున్న పాపనికి పాలిచ్చిపోవె ।।హా।।
రాకాసి రావణుని తాను అబ్బాయి
రాజును కొట్టేసి తా రాజ్యమేలు ।।హా।।
శ్రీ వెంకటయ్య
దిక్కు నీవయ్య
చిచ్చోలోలో హాయిహాయి ఆపదలు గాయి
చిన్నవాళ్లనుగాయి శ్రీవేంకటేశ!
శ్రీవెంకటయ్య దిక్కునీవయ్య
శరణన్న వారిని చేకొనుమయ్య
తిరుపతికి బొయ్యేటి చిట్టి దాసరి
తిరువెంగళప్పకి ఎందరే స్త్రీలు?
పెద్దామె నాంచారు పేరు తులశమ్మ
అందరిలో చక్కనిది అలుమేలు మంగ
చిలకల్లు చెలరేగి జీడికొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి యేమేమియడుగు?
పాలు త్రాగ గిన్నడుగు పాడావునడుగు
ఎందుకు యేడ్చేవు? ఏలా యేడ్చేవు?
పాలకు యేడ్చేవు పసిబిడ్డ నీవు
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిన్ని నా అమ్మాయి చీమంతెకద్దె
ఏడ్చేటి ఏడ్పుకు కొండలదురును
చిట్టిముత్తెముపుట్టె సీత కడుపున
స్వాతివాన కురిసె సముద్రంబు నిండ
చిన్ని నా అమ్మాయి నవ్వి పలికితే
మునిపండ్ల ముత్యాలు విగడ పొగడాలు
చక్కిళ్లు చామంతి రేకులుబోలు
తీరు తీరూ కొండ తీరైన కొండ
తీరైయున్నదే తిరుపతీ కొండ
అందరి మామలు చందమామలు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడికి బువ్వ పెట్టనేరాదు
పెట్టితే అబ్బాయిని పట్టుకొని పోవు
నిద్రపో నిద్రపో నీలి వచ్చినది
నీలి జంగమ వెంట బూచి వచ్చినది
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేండ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు
నిద్రపో నిద్రపో భద్రశయనుడ
బలభద్రశయనుడ! హరి నిద్రపోర!!


































































































































Review పిల్లల ఆటపాటలు.