పిల్లల ఆటపాటలు

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ,
జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో
శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..

ఏమే ఓ చిట్టి.. ఏడవకే!
ఏమే ఓ చిట్టి- ఏడవకే ఈ రొట్టిముక్క
విరచిపెట్టి- నిన్ను పడుకోబెట్టనా జోకొట్టి
।।ఏమే।।
అడుగో బూచివాడు
మన అటక మీదున్నాడు
ఏడిస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు
।।ఏమే।।
మిట్ల గుడ్డివాడు
పొణకంత పొట్టివాడు
మన తట్టలో దాగున్నాడు
జడ పట్టుకు లాగుతాడు
।।ఏమే।।
నోరు చూపుతాడు
పలు కోరలు చూపుతాడు
నీ ఆరడి విన్నాడూ
ఈసారి ఊరుకోడు
।।ఏమే।।
అల్లరి చేయకమ్మ
నీకు బెల్లము పెట్టెదనమ్మా
అల్లరి చేయకమ్మ
పల్లకీ ఇదిగోనమ్మా
ఇలా అల్లరి చేసే వాళ్లను
పిల్లికి ఇచ్చేస్తాను
।।ఏమే।।
కన్నతల్లి నీవు
కాటుక పెట్టించుకోవే
వాళ్ల అమ్మాయి చూడు
నిను చూచి నవ్వుతోంది
।।ఏమే।।
ఉయ్యాలూపిస్తాను
బట్లకొయ్యను చూపిస్తాను
నెయ్యా బువ్వా తిను
తాతయ్య నిన్నెత్తుకొనును
।।ఏమే।।

నిదురపోగదుర బాల
నిదురపోగదుర బాల
నీపై పదము పాడెదనుజాల
నీవు నిదుర బోకుంటేను
అడుగో బూచాడు మూల
పొంచుండెగదర శ్రీరమణలోల
నిదురపోగదుర బాల
వట్టి రట్టీల కొడుక
మాయన్న ముద్దుల ముద్దు విడకు
కొట్టసాగెదరు నిన్ను
పాలుబువ్వ పెట్టెదమన్న తినకు
నిదురపోగదుర బాల
తామరసభవుని జనక
చీకటి రాముని బ్రోవు మనక
సోమసుందరుని కొడుక
సత్యభామా రమణి కులిక పడక
నిదురపోగదుర బాట

ఉల్లాయాచీ!
చొల్లా యాచీ!!
ఉల్లాయాచీ! చొల్లా యాచీ!!
పొద్దు పొద్దూ ఒక చాయ పొద్దెక్కీ ఒక చాయ
పొద్దుపోయె చెల్లమ్మ పొన్న పూచాయ
జాము జాము వొకచాయ జామొక్క చాయ
జామూపై చెల్లమ్మ పొగడపూ చాయ
దామరాగుంటక్కు తలకడక పోతే
జల్లు జల్లుమని రాలె జాజి పువ్వూలు
నిద్రపో చెల్లమ్మా నరీ నిద్రలేలా
నిద్ర కన్నెకలొచ్చి నిన్ను లేపెదరు
నిద్రకూ వెయ్యేళ్లు నీకూ వెయ్యేళ్లు
నిన్నుగన్న తల్లికీ నిండు నూరేళ్లు
అందరీ మామల్లు చందమామల్లు
చెల్లమ్మ మామల్లు రామలక్ష్మణులు
చెల్లమ్మ బుద్ధులూ వేణునాదములు
నిండు పున్నమి నాడు చందమామ నిన్ను
కోరి పోయాడమ్మ నీ మేనమామ!
ఏడవకు ఏడవకు వెర్రి చెల్లమ్మ
ఏడిస్తే నీ కంట్లో నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలయిన కారవే బంగారు కండ్లా

జో జో ముద్దులబాల
జో జో ముద్దులబాల జోజో పరమ సుశీల
జో జో భారతపుత్రీ జోజో సారసప గాత్రీ
చిన్నమోము చిన్నిపోవ కన్ను చెదర ఏడువనేలా
కన్నతల్లి కారణములేమొ కరములెత్తి ఆడవె తల్లి ।।జో।।
దంతపు టుయ్యాలలోన
ధగధగ మెరిసేటి పాన్పుపైన
చింతలేక నిదురాపోవా
ఇంత ఆగడమేమొగాని ।।జో।।
పాలుత్రాగునాడె నీవు
పాడవలెనని సీతా చెరితం
భూమి మీద పరుగిడినపుడే
భేరివిద్యలు నేర్చేవు తల్లీ ।।జో।।
భారతీయ నారీమణులూ
భాసిల్లుము సీతా చెరితం
కన్నతల్లి కారణమేమి
కరములెత్తి ఆడవె తల్లీ ।।జో।।

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top