ఈ సామెతలో ఎంతో నిగూఢార్థం ఉంది. మనకు కావాల్సిన వాటిని మనం అడిగి తీసుకోవడం ఎంత అవసరమో ఈ సామెత చాటి చెబుతుంది. మీకు కావలసింది ఏమిటో మీరు నోరు తెరిచి అడిగితే కానీ, ఎవరూ ఊరికే ఇవ్వరు కదా!. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. కానీ అవి నోరు దాటి బయటకు రావు. అడిగితే ఏమైనా అనుకుంటారేమోనని, లేదా తమ కోరిక సమంజసమైనదా? కాదా? అనే మీమాంసతోనూ మనసులోనే తమ కోరికను అణచిపెట్టేసుకుంటారు. అవతలి వారు ఎల్లప్పుడూ మన మనసెరిగి ప్రవర్తిస్తారని అనుకోవడానికి లేదు. కాబట్టి ఏదైనా కావాలంటే, అది నిజాయితీ, అర్హమైనదీ అయితే, ఆ కోరికను నిర్భయంగా వెల్లడి చేయాలి. లేదంటే అది తీరే అవకాశం ఉండకపోవచ్చు.
ఇటువంటిదే మరొక సామెత కూడా ఉంది.
‘నెత్తిన నోరుంటేనే పెత్తనం చెల్లుతుంది’.
మనం కొన్ని పనులు చేయాలంటే మన మాటల్లో చాతుర్యం, నిజాయితీ, దృఢత్వం, హుందాతనం ఉండాలని ఈ సామెతకు అర్థం. మీకు కావాల్సింది అడగటం, ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అప్పుడే జీవించడం తేలిక అవుతుంది.
Review ‘‘అడగనిదే అమ్మ అయినా పెట్టదు’’.