అదిగోనండీ మా బడి! అదిగోనండీ మా బడి

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

నేర్పును మాకు చక్కని నడవడి
శ్రద్ధగ చదువులు చదివెదమండి
చక్కగ కలిసి ఉంటామండి

పాఠాలెన్నో చదివామండి
పంచతంత్రం విన్నామండి
అందులో నీతి తెలిసిందండి
ఎప్పుడూ తప్పులు చేయం లెండి

చక్కగ బుద్ధిగ ఉంటామండి
మంచి పనులు చేస్తామండీ
కలసి అందరం ఉంటామండి
ఆనందంగదా జీవిస్తామండి

తగవులు ఎప్పుడూ పడమండి•
కలసికట్టుగా ఉంటామండి
కలసిమెలసి పని చేస్తామండి
కంచుకోట నిర్మిస్తామండి

కోటకు జెండా కడతామండి
ఆకాశాన ఎగరేస్తామండి
ఆ ఎగిరే జెండా మాదేనండి
అది మా భారత జెండా సుమండీ!

అల్లరి రాజా
అల్లరి రాజా వచ్చాడు
పిల్లలందరినీ పిలిచాడు
అల్లరి ఎంతో చేశాడు
గొడవలు ఎన్నో తెచ్చాడు

నాన్నతో తన్నులు తిన్నాడు
అల్లరి అంతా మానాడు
పుస్తకం చేతబట్టాడు
శ్రద్ధగా నాన్నతో వెళ్లాడు

గురువు వద్ద చేరాడు
చదువులు బాగా చదివాడు
పాఠాలెన్నో నేర్చాడు
పెద్దల మన్నన పొందాడు

ఆట‘పాఠాలు’

ఆటలంటే మాకిష్టం
పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా
అల్లరి పనులే మాకిష్టం

సినిమాలంటే మాకిష్టం
మిఠాయిలంటే మాకిష్టం
సినిమాల కన్నా మిఠాయిల కన్నా
షికార్లు అంటే మాకిష్టం

పిట్టలంటే మాకిష్టం
పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా
చెట్లు ఎక్కడం మాకిష్టం

కొత్తబట్టలు మాకిష్టం
పౌడరు స్నోలు మాకిష్టం
బట్టలు కన్నా పౌడరు కన్నా
మట్టిలో ఆటలు మాకిష్టం

టీచర్లంటే మాకిష్టం
పాఠాలంటే మాకిష్టం
టీచర్ల కన్నా పాఠాల కన్నా
బడి సెలవంటే మాకిష్టం

వెన్నెలంటే మాకిష్టం
వానలంటే మాకిష్టం
వెన్నెల కన్నా వానల కన్నా
అమ్మ ముద్దులే మాకిష్టం

ఊగూ ఊగూ గంగిరెద్దా

ఊగూ ఊగూ గంగిరెద్దా – ఉగ్గుపాలె గంగిరెద్దా
సోలి ఊగె గంగిరెద్దా – సోలెడు పాలె గంగిరెద్దా
తాళీ ఊగే గంగిరెద్దా – తవ్వెడు పాలె గంగిరెద్దా
మారీ ఊగే గంగిరెద్దా – మానెడు పాలె గంగిరెద్దా
ఆగీ ఊగే గంగిరెద్దా – అడ్డపాలె గంగిరెద్దా

Review అదిగోనండీ మా బడి! అదిగోనండీ మా బడి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top