‘‘ఆకు వచ్చి ముల్లు మీద పడినా ముల్లొచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే’’

గెలవలేని గొడవల్లోకి తలదూర్చవద్దని ఈ సామెత అప్రమత్తం చేస్తుంది. మనం కొన్ని విషయాల్లో అశక్తులుగా ఉండిపోవాల్సి వస్తుంది. దీనికి అర్థం మనం బలహీనులమని కాదని అర్థం. కొన్నిసార్లు సందర్భాలు, పరిస్థితులు అలా వస్తాయి. అంతే. అటువంటప్పుడు మౌనంగా ఉండటం మేలు. నిజానికి జీవితం అంటేనే ఒక పోరాటం. అటువంటి పోరాటాలు చేయాల్సిన సందర్భాలు ఎవరి జీవితంలోనైనా చాలా వస్తాయి. వా•న్నిటినీ అన్నిసార్లూ మనం ఎదుర్కొనే పరిస్థితి రాకపోవచ్చు. తాహతుకు మించి వాటిని ఢీకొట్టాలని చూడటం ఒక్కోసారి మూర్ఖత్వం అని కూడా అనిపించుకుంటుంది. ఏదో సినిమాలో చెప్పినట్టు ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో’ తెలిసి ఉండాలి. అలా కాదని మొండిగా ముందుకు వెళ్తే రెంటికీ చెడిన రేవడి అవుతుందనే అర్థంలో ఈ సామెతను ఉప యోగిస్తారు. పోరాటమైనా, ప్రయత్నమైనా మన స్థాయి, హోదాకు తగినట్టు ఉండాలి.

Review ‘‘ఆకు వచ్చి ముల్లు మీద పడినా ముల్లొచ్చి ఆకు మీద పడినా చిరిగేది ఆకే’’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top