ఎవురోచ్చిందెనుగు?

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక.

ఊగు ఊగు గంగెద్దా

ఊగు ఊగు గంగెద్దా – ఉగ్గుపాలె గంగెద్దా
సోలీ ఊగే గంగెద్దా – సోలెడు పాలె గంగెద్దా
తాళీ ఊగే గంగెద్దా – తవ్వెడు పాలె గంగెద్దా
మారీ ఊగే గంగెద్దా – మానెడు పాలె గంగెద్దా
ఆగీ ఊగే గంగెద్దా – అడ్డపాలె గంగెద్దా

ఉయ్యాలోయ్‍.. జంపాలోయ్‍

ఉయ్యాలోయ్‍ జంపాలోయ్‍
కొత్తకుండోయ్‍ కొమిరెల్లోయ్‍
ఎలోనోయ్‍ మల్లన్నోయ్‍ అల్లల్లల్లో

ఊగాడమ్మా ఊగాడు

ఊడాగమ్మా ఊగాడు- ఊగే చిలుకా ఊగాడు
బంగారుబొమ్మా ఊగాడు – తంగెడుపువ్వా ఊగాడు
కులదీపంలా ఊగాడు – గుడిపావురమా ఊగాడు
కన్నులవెలుగా ఊగాడు – సొగసుల గువ్వా ఊగాడు
శుకమాపికమా ఊగాడు – చక్కని నెమలీ ఊగాడు
చక్కెరబొమ్మా ఊగాడు – ముద్దులగుమ్మా ఊగాడు

ఏనుగొచ్చింది

ఏనుగొచ్చింది ఏనుగు – ఏవూరొచ్చిందేనుగు
మావూరొచ్చిందేనుగు – మంచినీళ్లే తాగిందేనుగు
ఉప్పునీళ్లు తాగిందేనుగు – ఊరెళ్లగొట్టిందేనుగు
మంచి గంధం మాచికాయ

మంచి గంధం మాచికాయ

ఊదొత్తి ఉమ్మకాయ
కప్పురంబు కచ్చూరంబు
కస్తూరికాగై రికమ్ము
సన్నవేరు సాంబరాణి
గంధ ధూపములు గండాదీపం
హారతి హోమం అగ్నిధూమములు
దేవత సత్తువ దివికె జోతల
పురిటి సుద్దికే పున్నెము జోతలు

చిలుకల్లు చిలుకల్లు

చిలుకల్లు చిలుకల్లు అందురే కాని
చిలుకలకు రూపేమి పలుకులే గాని
హంసల్లు హంసల్లు అందురేగాని
హంసలకు రూపేమి ఆటలేగాని
పార్వాలు పార్వాలు అందురే గాని

Review ఎవురోచ్చిందెనుగు?.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top