చెరువు చెంతకు చేరితిమి.. చేపలు, పీతలు చూచితిమి

గుడుగుడు కుంచం
గుడుగుడు కుంచం గుండే రాగం
పావడ పట్టం పడిగే రాగం
అప్పడాల గుర్రం ఆడుకోబోతే,
పే పే గుర్రం పెళ్లికి పోతే,
అన్నా అన్నా నీ పెళ్లి ఎప్పుడంటే
రేపు కాక ఎల్లుండి,
కత్తీ కాదు బద్దా కాదు గప్చుప్

లాలమ్మ లాలి
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసే
బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసే
అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసే
ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి
ఉగ్గెట్టు మీయమ్మ ఊరెళ్లింది
పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్లింది
నీలోసె మీయమ్మ నీళ్లకెళ్లింది
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
చక్కని లోకంలో చిక్కుల దారులు
చక్కని లోకంలో
చిక్కుల దారులు
చిక్కుల దారులో
చిక్కని చీకటి
చిక్కని చీకటిలో
చిక్కిన తారల్లు
చిక్కిన తారలో
చెక్కిన రప్పల్లు
చెక్కిన రప్పల్లో
నక్కిన కాంతుల్లు
నక్కిన కాంతుల్లో
దక్కిన హల్లు
దక్కిన ఊహల్లో
మిక్కిలి వింతల్లు
బడికి సెలవులు వచ్చినవి
బడికి సెలవులు వచ్చినవి
బామ్మ ఊరికి వెళ్లితిమి
మామయ్య పిల్లల చేరితిమి
బంధువులెందరినో కలిసితిమి
ఆరు బయటకు పోయితిమి
ఆటలు, పాటల గడిపితిమి
చెరువు చెంతకు చేరితిమి
చేపలు, పీతలు చూచితిమి
ఈత కొట్టుచు ఎగిరితిమి
ఈలలు, కేరింతలు కొట్టితిమి
చెట్టూ చేమా తిరిగితిమి
ప్రకృతి వింతలు చూచితిమి
తోటలు, పొలముల కెళ్లితిమి
ఫల, పుష్పములు తెంపితిమి
వెన్నెల రాత్రులు కాంచితిమి
అమ్మమ్మ పక్కన చేరితిమి
కథలు, వింతలు చెప్పితిమి
సెలవులు హాయిగ గడిపితిమి
తిరిగి ఊర్లకు చేరితిమి!

Review చెరువు చెంతకు చేరితిమి.. చేపలు, పీతలు చూచితిమి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top