మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల
పరిచయమే… ఈ శీర్షిక
అ ఆ లతో పాటా
అ ఆ లు దిద్దుదాము – అమ్మ మాట విందాము
ఇ ఈ లు చదువుదాము – ఈశ్వరుని కొలుద్దాము
ఉ ఊ లు దిద్దుదాము – ఉడతను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ – అందరిని పిలుద్దాము
ఒ ఓ ఔ అంటూ – ఓనమాలు దిద్దుదాము
అం అః అంటూ – అందరము ఆడుదాము
గురువు గారు చెప్పిన పాఠాలు చదువుదాము
మామగారు చెప్పిన మంచి పనులు చేద్దాము
తాత గారు చెప్పిన నీతి కథలు విందాము
అందరం కలుద్దాము – ఆనందంగా ఉందా.
ఎందుకురా?
ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండేటందుకురా
చెరువులు నిండేదెందుకురా?
పంటలు పండేటందుకురా
పంటలు పండేదెందుకురా?
ప్రజలు బతికేటందుకురా
ప్రజలు బతికేదెందుకురా?
దేవుని కొలిచేటందుకురా
దేవుని కొలిచేదెందుకురా?
ముక్తిని పొందేటందుకు
చందమామ రావే..జాబిల్లి రావే!!
చందమామ రావే – జాబిల్లి రావే
బండి మీద రావే – బంతిపూలు తేవే
పల్లకిలో రావే – పంచదార తేవే
సైకిలెక్కి రావే – చాక్లెట్లు తేవే
పడవ మీద రావే – పట్టు తేనె తేవే
మారుతిలో రావే – మంచి బుక్సు తేవే
పెందలాడ రావే – పాలు పెరుగు తేవే
మంచి మనసుతో రావే – ముద్దులిచ్చి పోవే
అన్నియును తేవే – మా అబ్బాయికీయ
ఒక్కటి ఓ చెలియ
ఒక్కటి ఓ చెలియా, రెండూ రోకళ్లు
మూడు ముచ్చిలకా, నాలుగు నందన్నా
అయిదుం బేడల్లు, ఆరుంజవ్వాజి
ఏడూ యెలమంద, ఎనిమిది మనమంద
తొమ్మిది తోకుచ్చు.
Review దేవుని కొలిచేందుకురా?.