పందెమే గెలిచింది నా గాలిపటం

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారడేసి మొగ్గ
అట్లు పొయ్యంగ ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ
రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగ
పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
చూచి వద్దాం రండి, సుబ్బారాయుడి పెళ్లి
చూచి వద్దాం రండి మా వాళ్లింట్లో పెళ్లి
మళ్లీ వద్దాం రండి దొరగారింట్లో పెండ్లి
దోచుకు వద్దాం రండి.

లాలమ్మ లాలి..
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె
బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె
అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె
ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి
ఉగ్గెట్టు మీయమ్మ ఊరెళ్లింది
పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్లింది
నీలోసె మీయమ్మ నీళ్లకెళ్లింది
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
వానా వానా వల్లప్పా
వానా వానా వల్లప్పా
చేతులు చాచు చెల్లప్ప
గడ్డిలోన గారప్ప
దొడ్డి తిరుగు అన్నప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరగలేను నరసప్ప

వెలుగు
వెలుగులన్నింటిలోన ఏ వెలుగు చెప్పుడు
మా ఇంటి పాపలూ తిరగంగ వెలుగు
నవ్వులన్నింటిలోన ఏ నవ్వు వెలుగు
మా ఇంట పాపలూ నవ్వంగ వెలుగు
ఆటలన్నింటిలోన ఏ ఆట వెలుగు
మా ఇంట పాపల్లూ ఆడంగ వెలుగు
పల్కులన్నింటిలోన ఏ పల్కు వెలుగు
మా ఇంట పాపల పల్కులే వెలుగు
ఇంటింటా ఇంటింటా ఏ వెలుగు వెలుగు
ఇంటింటా ఇంటింటా మా బాల వెలుగు
గాలిపటం
ఎగిరింది ఎగిరింది నా గాలిపటం
గాలిలో ఎగిరింది నా గాలిపటం
పై పైకి ఎగిరింది నా గాలిపటం
పల్టీలు కొట్టింది నా గాలిపటం
రంగురంగులదండీ నా గాలిపటం
రాజ్యాలు దాటింది నా గాలిపటం
మబ్బును తాకింది నా గాలిపటం
పందెమే గెలిచింది నా గాలిపటం

Review పందెమే గెలిచింది నా గాలిపటం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top