పసందైన వసంతం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

వసంతాన్ని చూడు!
వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు
దానికెన్ని గొంతులో- కోటి పికములేమో!
వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు
దానికెన్ని కన్నులో- కోటి పూవులేమో!
వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు
దానికెన్ని చెవులో- ఒక కోటి చిగురులేమో!
వసంతరుతువంటేనే వత్సరాది జగతికి!
వసంత రుతువొస్తే పసందవును చెట్లకి..

తరమవే.. తరమవే.
తరమవే తరమవే కాకీ కదలాడనే
గద్ద ఒకటి చెట్టు మీద పొంచి కూరుచున్నదే
గూటిలోన పొదగనున్న గ్రుడ్లు మేయనున్నదే
।। తరమవే తరమవే ।।
వాడి గోళ్ల దెబ్బయినా ఉక్కుముక్కు పోయినా
తగిలేనా అంతేలే అంత పెద్ద గద్దయినా!
।। తరమవే తరమవే ।।
పక్షి జాతికంతటికీ ద్రోహబుద్ధి గద్ద చూడు
బలహీనులను తిని బలిసే రక్కసిమూకకు ప్రతినిధి
।। తరమవే తరమవే ।।
చివురించిన చెట్టుకొమ్మ ఎర్రడాలు మడతలలో
గుట్టుచప్పుడవని రీతి కూరుచుంది మాయ గద్ద
।। తరమవే తరమవే ।।
బుల్లిబుల్లి గ్రుడ్లు పెట్టి ప్రేమారగ పొదివి పెంచి
లోకానికి కాపలాగ కాకిముక్కులుంచవే!
।। తరమవే తరమవే ।।

హిందూ ధర్మసూత్రాలు
మన ధార్మిక గ్రంథాలు
ఏం బోధిస్తున్నాయి?

మనకు ఎనలేని నిజమైన సంపద.. మన పురాతన భారతీయ ధార్మిక గ్రంథాలే. ఇవి మనకు బోధించే విశిష్ట ధర్మాలు ఏమిటంటే..

కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి
సమస్త జ్ఞానం పొందాలంటే..
ఉపనిషత్తులు చదవాలి.

పరస్త్రీ వ్యామోహం పోవాలంటే..
రామాయణం చదవాలి.

రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే..
మహా భారతం అధ్యయనం చేయాలి.

భగవంతుని తత్త్వం తెలియాలంటే..
భాగవతం చదవాలి.

చక్కని రాజ్యపాలన సూత్రాలు తెలియాలంటే..
కౌటిల్యుని అర్థశాస్త్రం చదవాలి.

అన్యోన్య దాంపత్యం గురించి తెలుసుకోవాలంటే..

వాత్సాయన కామసూత్రాలు చదవాలి.

చక్కని ఆరోగ్యం కోసం..
ఆయుర్వేదం చదవాలి.

మేథస్సు కావాలంటే..
వేద గణితం చదవాలి.

శారీరక ఆరోగ్యం, శారీరక సౌష్టవం కోసం..
పతంజలి యోగ శాస్త్రం చదివి ఆచరించాలి.

భవన నిర్మాణాల గురించి తెలియాలంటే..
వాస్తు శాస్త్రం చదవాలి.

గ్రహ, నక్షత్రాలను అధ్యయనం చేయాలంటే..
ఆర్యభట్టుని ఖగోళ శాస్త్రాన్ని చదవాలి.

Review పసందైన వసంతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top