పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక

ఓబయ్య!
ఓ బయిత

ఓబయ్య! ఓ బయిత!
సొరకాయ కోతలు కోయకురా!
రాతిరి జిలివల వేశావా?
రొయ్యకు మీసము జూశావా?
జీలుగు బెండుగు తేల్చావా?
వాలుగు పొడవులు కొలిచావా?
ఊతల నడ్డుగ పాతావా?
గాలము వాడిగ గుచ్చావా?
ఆలికి చేపలు తెచ్చావా?
ఓబయ్య! ఓ బయిత!
సొరకాయ కోతలు కోయకురా!

మా పాప
చెంబులో..

మా పాప చెంబులో
నీళ్లొలక బోసితే
చెందురుడు జారిపడి
చిందులాడేడు
చేయెత్తి మా పాప
చెడ మొత్తినాది
మరికొంతసేపటికి
మనసు నొచ్చింది
పాపనేమనలేక
పారిపోయేడు
పాకొచ్చి పాపాయి
పడకజేరింది
కసితీర తానొచ్చి
కళ్లబడ్డాడు
నీకింతె యని పాప
నిదురబోయింది
మరల నేడొచ్చునో
మరి రాడో నేనెరుగ

తువ్వాయి
తువ్వాయి తువ్వాయి ఏమి తువ్వాయి?
తువ్వాయి తువ్వాయి మంచి తువ్వాయి!
తువ్వాయి మెడలోన ఏమి ఉన్నాయి?
తువ్వాయి మెడలోన మువ్వలున్నాయి!
తువ్వాయి కాళ్లలో ఏమి ఉన్నాయి?
తువ్వాయి కాళ్లలో పరుగులున్నాయి!
తువ్వాయి నోట్లోన ఏమి ఉన్నాయి?
తువ్వాయి నోట్లోన తెలిపాల నురుగలున్నాయి!
తువ్వాయి తువ్వాయి ఎవరి తువ్వాయి?
ఆవుగారి తువ్వాయి అసలు మా తువ్వాయి

బహ్మోత్సవ వైభవం
2022, సోమవారం, సెప్టెంబరు 26 నుంచి బుధవారం, అక్టోబరు 5 వరకు
స్వామి వారి స్వర్ణ రథం
1992లో తయారుచేసిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి స్వర్ణరథం సుమారు 21 ఏళ్లపాటు సేవలందించింది. దాని స్థానంలో 2013లో కొత్త స్వర్ణరథాన్ని తయారు చేశారు. తిరుమలలోని మ్యూజియంలో ప్రత్యేకంగా వర్క్షాపు ఏర్పాటు చేసి ఈ కొత్త స్వర్ఱరథాన్ని రూపొందించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్దది. 32 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు గల ఈ రథానికి మొత్తం 74 కిలోల మేలిమి బంగారం పూశారు. 18 అంగుళాల మందంతో కూడిన 2900 కిలోల రాగిపై తొమ్మిదిసార్లు స్వర్ణ తాపడం చేశారు. బీహెచ్‍ఈఎల్‍ సంస్థ రూపొందించిన హైడ్రాలిక్‍ చక్రాలతో, సరికొత్త హంగులతో స్వర్ణరథాన్ని తీర్చిదిద్దారు. వైఖాసన ఆగమోక్తంగా కొత్త స్వర్ణరథానికి సంప్రోక్షణ, వైదిక పూజలు నిర్వహించారు. తొలిసారిగా 2013, అక్టోబర్‍ 10వ తేదీన గరుడ వాహన సేవ సందర్భంగా రథరంగ డోలోత్సవం నిర్వహించారు. స్వర్ణకాంతుల స్వర్ణ రథంలో దేవదేవుడైన స్వామి వారు, అమ్మవార్లతో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అప్పటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొత్త స్వర్ణ రథం ఒక భాగమైంది. ంతకుముందు 1992 వరకు శ్రీవారిని వెండిరథంపై ఊరేగించేవారు. 1992లో స్వర్ణరథాన్ని తయారుచేశారు. తరువాత ఈ కొత్త స్వర్ణరథం రూపొందించింది.

Review పిల్లల ఆటపాటలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top