ఓం నమ: శివాయా
నవనీత హృదయా
తమ: ప్రకాశా
తరుణేందు భూషా
నమో శంకరా! దేవదేవ
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా
భక్తియేదో, పూజలేవో తెలియనైతినే ।।భ।।
పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా ।।భ।।
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా
మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా ।।మం।।
మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే ।।మం।।
నాదమేదో వేదమేదో తెలియనైతినే ।।నా।।
వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ ।।వా।।
మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా
నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా
ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్తువో రుద్రయ్య ।।ఏ।।
ప్రాతకముగ చిరు వేట చూపి నా ఆకలి దీర్పగ రావయ్య ।।ప్రా।।
దీటుగ నమ్మితి గనవయ్యా వేట చూపుమా రుద్రయ్యా ।।దీ।।
వేట చూపుమా రుద్రయ్యా.. వేట చూపుమా రుద్రయ్యా ।।వే।।
ఈ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందినది. 1954లో వచ్చిన ‘కాళహస్తి మహాత్మ్యం’ చిత్రంలోనిదీ పాట.
శివుడి పాటలు తెలుగు సినిమాల్లో అనేకం వచ్చాయి. అవన్నీ వేటికవే ప్రత్యేకం. అలాగే ఈ పాట కూడా ఎంతో ప్రత్యేకం. తోలేటి ఈ గీత రచయిత కాగా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రాగయుక్తంగా, శివభక్తి ప్రతిఫలించేలా ఆలపించారు. ఈ గీతానికి ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్దనం మంచి బాణీలు అందించారు.
భక్తి, ఆధ్యాత్మికత అంటే తెలియవు.. మంత్రాలు, తంత్రాలు రావు.. నాదమేదో, వేదమేదో తెలియదు. ఇవేవీ తెలియని, రాని ఓ సాధారణ భక్తుడు తనకు వేట దొరకాలని, ఆ రోజుకు ఆకలి తీర్చాలని శివుడికి భక్తితో, తనకు తోచిన పదాలతో ప్రార్థిస్తూ పాడుకునే పాట ఇది. తప్పక వినాల్సిన పాట ఇది.
Review మహేశా పాపవినాశా.