మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
జో అచ్యుతానంద
జో అచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామగోవింద
నందు నింటను జేరి నయముమీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరంబున నున్న కంసుని బడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలిపరమానంద రామగోవింద
తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వేసి
మంచి అలవాట్లు
ప్రొద్దున మనమూ లేవాలి
పళ్లను బాగా తోమాలి
చక్కగ స్నానం చేయాలి
చింపిరి తలనూ దువ్వాలి
ఉతికిన బట్టలు కట్టాలి
గ్లాసెడు పాలను తాగాలి
దేవుడికి దండం పెట్టాలి
చక్కగ బడికి పోవాలి
గురువు మాట వినాలి
చదువులు చక్కగ చదవాలి
లాలి కృష్ణయ్య
లాలి శ్రీకృష్ణయ్యా నీలమేఘవర్ణా
బాలగోపాల నీవు పవ్వళించవయ్యా ।।లాలి।।
శృంగారించిన మంచి బంగారుటుయ్యాలలో
శంఖచక్రధరా స్వామి నిదురబోవయ్యా ।।లాలి।।
శేషపాన్పు మీద శయనించి నా కృష్ణా
దోషాపహార వసుదేవతనయ నిద్రపోవయ్యా ।।లాలి।
Review లాలిపరమానంద రామగోవింద.