సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’ల పరిచయం.
పొంగుడు కుంగుడు
‘‘మూరెడు పొంగడం ఎందుకు?
బారెడు కుంగడం ఎందుకు?’’.
చదవడానికి ఇవి రెండు వాక్యాలే.. కానీ, విశ్లేషించుకుంటూ వెళ్తే.. ఎంత వ్యక్తిత్వ వికాసం ఉంది ఈ వాక్యాల్లో..! ఎంతో పెద్ద విషయం ఆరంటే ఆరు పదాల్లో ఎంత చక్కగా ఇందులో ఒదిగిపోయిందో కదా!. మన తెలుగులోని అందమిదే.
ఇక, ఈ సామెత కథలోనికి వస్తే.. మనం నిత్య జీవితంలో కొన్నిసార్లు ఆనందపడతాం. మరికొన్ని సార్లు విచారంలో మునిగిపోతాం. ఆనందం, బాధ.. ఏది కలిగినా.. ఒకే విధంగా ఉండాలనే అర్థం ఇందులో ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకున్నప్పుడే మన ఎదుగుదల సాధ్యమనే అందమైన పాఠం కూడా ఈ సామెతలో ఉంది. ఏదైనా మనకు మేలు జరిగితే మనకిక ఎదురే లేదన్నట్టుగా పొంగిపోతాం. అదే సందర్భంలో మనకు ఏదైనా ఆపద కానీ, ఇబ్బంది కానీ కలిగితే.. ఇక మరో దారి లేదన్నట్టుగా కుంగిపోతాం. ఈ రెండూ కూడా మనిషికి కూడనివే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఎంతో తాత్విక జ్ఞానాన్ని ఈ సామెత ఆరు పదాల్లో చెప్పేసింది. ద్వంద్వ భావాలకు అతీతంగా ఉండే వారే స్థితప్రజ్ఞులని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ సామెత కూడా ఆ విషయాన్ని ఇంకా సరళంగా, సూటిగా చెబుతోంది. ఆనందం కలిగినప్పుడు మనంతటి వాళ్లే లేరన్నట్టుగా పొంగిపోవడం కూడదు. ఎందుకంటే వెలుగు వెనుకే చీకటీ ఉంటుంది. ఆనందం వెంటే బాధ పొంచి ఉంటుంది. ద్వంద్వ భావాలంటే ఇవే. ఇవి మనకు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఒద్దికగా, ఓపికగా ఉండాలని, ఇటువంటి భావోద్వే గాలను అదుపు చేసుకుని క్రమశిక్షణతో ఉంటేనే మన ఎదుగుదల సాఫీగా జరుగుతుం• •ని ఈ సామెత ద్వారా మన పెద్దలు చెబుతున్నారు.

Review సామెత కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top