మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం..
‘‘ఆలస్యం అమృతం విషం”
ఆలస్యం చేస్తే అమృతమైనా విషంగా మారిపోతుందట. చేయాల్సిన పనులను సకాలంలో చేయకపోతే కలిగే నష్టాన్ని గురించి ఈ సామెత మనల్ని అప్రమత్తం చేస్తుంది. సమయం, సమయ పాలన జీవితంలో ఎంత ముఖ్యమైనవో చాలా చిన్న పదాలతో చెప్పే ఈ సామెత చాలా గొప్పది. కొందరు కొన్ని పనులు చేపడతారు. ఎప్పటికీ దానిని పూర్తి చేయరు. దాని వల్ల ప్రయోజనం కలుగుతుందని, మేలు కలుగుతుందనీ తెలిసినా ఆ పనిని సకాలంలో చేయడంలో నిర్లక్ష్యం చేస్తారు. దీంతో దానివల్ల కలిగే ప్రయోజనం కలగకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమైన పనుల్ని నెరవేర్చే విషయంలో జాగు కూడదని ఈ సామెత చెబుతోంది. అలాఅని ఆయా పనుల్ని చేసే విషయంలో ఆతృత పడనవసరం లేదు. నిదానంగా చేస్తే చాలు.
Review సామెత కద.