మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
తలలో పూవులు
మెడలో పూసలు
మొలలో గజ్జెలు
పిల్లనగ్రోవి
నల్లని రూపు
అల్లరిపిల్లడు
ఎవరో! ఎవరో!
తలలో పూవులు
మెడలో పూసలు
మొలలో గజ్జెలు
పిల్లనగ్రోవి
నల్లని రూపు
అల్లరిపిల్లడు
ఎవరా! ఎవరా!
వెన్నదొంగ
పొదుపు
అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు
బంధువులొస్తే ఇచ్చిన డబ్బులు
గోలీలకు బిస్కట్లకు
దుబార ఖర్చులు చెయ్యొద్దు
కూడబెట్టుకొనుటే ముద్దు
చిన్నలైనా పెద్దలైనా
పొదుపు చేయుటను నేర్వాలి
పెద్ద మొత్తమును పొందాలి
చిన్న చిన్నగా చేసిన పొదుపే
పెద్ద మొత్తం అవుతుంది.
అవసరాలను తీర్చుతుంది
అందుకని మరి అందుకనీ
సంపాదించుట ఎంత ముఖ్యమో
పొదుపు చేయుట అంత ముఖ్యము
దుబార ఖర్చులు చెయ్యొద్దు
పొదుపు చేయుటను మరువద్దు
గాంధీ తాత
గాంధీతాత మహాత్ముడు
ఎలా ఎలా అయ్యాడు
అందరిచే మన్ననలను
ఎలా అందుకున్నాడు?
అందరి సుఖమును కోరి
గాంధీతాత బ్రతికాడు
సత్యమునే పలికాడు
స్వార్థాన్ని వదిలాడు
దీనుల పాలిటి అతడు
దేవుని వలె మెదిలాడు
దేశం కోసం సర్వం
ధారపోసి నడిచాడు
కోపాన్ని వదిలాడు
శాంతి బాట నడచాడు
మంచి మంచి గుణాలతో
మంచితనం పెంచాడు
అందుకనే గాంధీతాత
మహాత్ముడు అయ్యాడు
అందరిచే మన్ననలను
సదా అందుకుంటాడు
గాంధీతాత గుణాలను
మనము నేర్చుకోవాలి
అందరి మెప్పును పొందుచు
ముందడుగు వేయాలి
Review వెన్న దొంగ.