పిల్లలారా రండి
అబ్బాయి అమ్మాయి
లందరూ చేరండి
మన పల్లె కీనాడు
సంబ్రాలు పండుగలు
ధన ధాన్య సమృద్ధి`
సిరి సంపదల వృద్ధి
మన పల్లె లోగిళ్ల
పండుగలు జరపగా
సంబ్రాలు పంచగా
సుఖములకు సంతోష
గీతులకు నిలయముగ
కూర్చండి మన పల్లె
రండిరా దండిగా
నాట్యమాడే వేళ!
భాగ్య దేవతలారా
పరవశించండిరా!
నీరెండలో గాలి
వెండి తీగల కూర్చె
పసిడి తీగల నద్దె
పొద్దు పొడుపే వేళ!
వెన్నెలల మెడలలో
పూలు కై పేసింది
మొదుగుల గుండెల్లో
మోదుగలు పండెరా!
అడవి గుబురులు తరులు
క్రొక్కారు పూలతో
కురిశాయి ముత్యాలు
అతిథులెవరైన సరే
ఆహ్వాన మందించి
ఆసనా లివ్వండి
ఆసనా లివ్వండి
అర్థనగ్నత నిన్న
సిగ్గులో ముంచింది
ఇరుగు పొరుగులకిపుడు
ఇద్దాము దుస్తులను
బెంగేల పెద్దోడ
పంట తల్లికి కొదవ
లేదోరి చిన్నోడ
చిన్నమ్మ నవ్వింది
ఆలమందల్లారా
అడవిలో దూరాలా
పోకండి! ఈ గరిక
మైదాన మది మీదే!
పోకండి పోకండి
పాల పొదుగుల్లార
మేయండి, ఆడండి
గుమ్మటా లూదండి
పిల్లల్లారా రండి!
పండుగలు జరపండి
అమ్మాయి అబ్బాయి
లందరూ హాయిగా..
సంబరాలకు నేల
పసిడి బాలింతరా
అమ్మలూ నాన్నలూ
అందరూ రండిరా!
Review సంబరాలు పండుగులు.