మహా పతివ్రత మండోదరి

మండోదరి మహా పతివ్రత. మండోదరి అంటే ‘మండనం యస్యస ఉదరం’.. అంటే` సన్నని నడుము గలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలదని అర్థం. భూమి వంటి ఉదరం అంటే, సంతాన సాఫల్యత గల ఉదరము అని భావం. ఈమె రావణుడి భార్య. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ కుమార్తె ఈమె. మహా శిల్పి అయిన మయబ్రహ్మ.. హేమ అనే ఒక దేవకన్యతో కలవగా మండోదరి వారికి జన్మించింది. రావణుడు వలచి, ఈమెను వరించాడు. ఈమెకు, రావణాసురుడికి పుట్టిన కుమారుడు ఇంద్రజిత్తు. ఒకనాడు మండోదరి తండ్రి మయబ్రహ్మతో కలిసి వనంలో సంచరిస్తుంది. అక్కడే రావణుడు మండోదరిని చూసి మోహిస్తాడు. తాను అవివాహితుడినైన తనకు మండోదరిని ఇచ్చి వివాహం చేయాలని కోరతాడు. మయబ్రహ్మ అందుకు అంగీకరిస్తాడు. రావణాసురుడి పట్టమహిషి అయిన మండోదని మిక్కిలి సౌందర్యవతి. బాహ్య సౌందర్యమే కాక ఆమె అంత:సౌందర్యం కూడా ఎంతో ఉన్నతమైనది. రాక్షసుడికి భార్య అయినా, ఆమె ఏనాడూ రాక్షస లక్షణాలను అనుసరించేలేదు. రావణుడు రాముడితో కలహానికి దిగినపుడు భర్తకు ఎన్నో విధాలుగా నచ్చచెప్పజూసింది. రాముడితో యుద్ధం వద్దని ప్రాథేయప డిరది. సందర్భం వచ్చినప్పుడల్లా భర్తకు నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధించింది. కానీ రావణుడు ఏనాడూ భార్య మాటల్ని వినిపించుకున్నది లేదు.
రామాయణంలో వాల్మీకి మహర్షి మండోదరి వ్యక్తిత్వం గురించి మిక్కిలి గొప్పగా వర్ణించారు. అందుకే ఆమె వ్యక్తిత్వం మిక్కిలి ప్రశంసార్హమైనది.
రామాయణం కావ్యంలోని కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తే.. మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినవైనా మానవత్వానికి ప్రతీకలై నిలిచాయి. అటువంటి పాత్రల్లో మండోదరి ఒకటి. రావణబ్రహ్మ సతీమణి అయిన ఈమె పేరు తలుచుకుంటేనే పాపాలు హరిస్తాయని పురాణాల్లో ఉంది. అంతటి మేలిమి సుగుణాల స్త్రీమూర్తి ఈమె. అహల్య, సీత, తార, ద్రౌపదితో కలిసి మండోదరి పంచకన్యగా ప్రసిద్ధి పొందింది. ఈ ఐదుగురు స్త్రీలు ఏదో విధంగా భర్తతో సంబంధాలు చెడిన వారే. మండోదరి గురించి అనేక పురాణ కథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం మండోదరి కుమార్తె సీత. ఆమెకు జన్మించిన సంతానం వల్ల భర్తకు ప్రాణహాని ఉందని అశీరవాణి పలికింది. ఒకనాడు ఆమె నీళ్లనుకుని కుండలోని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించి, ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. జోస్యం విషయం తెలిసిన భర్త తన బిడ్డను బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విడుస్తుంది. సముద్రుడు ద్వారా భూదేవికి, ఆపై జనకుడికి ఆ పెట్టె చేరుతుంది. ఆ పాపే సీత. రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తె (సీత)ను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది.

Review మహా పతివ్రత మండోదరి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top