మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే… ఈ శీర్షిక
మంచి నడవడి
అమ్మా నాన్న చెప్పిన పనులను
ఆనందంతో చేస్తాను
పెద్దలు చెప్పిన మంచి మాటలను
శ్రద్ధతో నేను వింటాను
గురువు చెప్పిన పాఠాలన్నీ
మరువక మరి మరి చదివెదను
మంచి నడవడి నేర్చుకుని
మంచి పేరును పొందెదను
మంచితనం పెంచాలి
అనాలీ అనాలీ
మంచి మాటలనాలి
వినాలీ వినాలీ
మంచి మాటలినాలి
చూడాలీ చూడాలీ
మంచినీ చూడాలి
పొందాలీ పొందాలీ
మంచి గుణం పొందాలి
చేయాలీ చేయాలీ
మంచి పనులు చేయాలి
పెంచాలి పెంచాలి
మంచితనం పెంచాలి
పండిత నెహూ
పండిత నెహ్రూ పుట్టిన రోజు
బాలబాలికలను పండుగ రోజు
భారతదేశం మురిసిన రోజు
దేవుడు సంతోషించిన రోజు
1889వ సంవత్సరం
నవంబరు 14వ తేదీ
అలహాబాదు నగరాన
స్వరూపరాణీ మోతీలాల్‍కు
చక్కని జాబిలి వలె జన్మించెను
గులాబిలాంటి చక్కని మనసుతో
జిలేబిలాంటి తీయని మమతతో
బాలి బాలికల ప్రేమించాడు
బాలల చాచాగా వెలుగొందాడు
భరతదేశమునకు స్వాతంత్య్రమును
సంపాదించగ తలచాడు
గాంధితాతకు ముఖ్య శిష్యుడై
స్వాతంత్య్రము సాధించాడు
ప్రధానమంత్రిగ మన దేశానికి
పదునేడేండ్లు పనిచేశాడు
భారతరత్నగా కీర్తిని పొంది
శాంతిదూతగా వెలిగాడు
పండిత నెహ్రూ నడిచిన బాటలో
మనమందరము నడవాలి
పగలూ రేయి పరిశ్రమిస్తూ
దేశ ప్రగతి సాధించాలి
పండిత నెహ్రూకు జేజేలు
అందించుదాం పదివేలు
ఉల్లిగడ్డంత
అయ్యగారేమో ఉల్లిగడ్డంత
అయ్యగారి పెండ్లాం పెద్ద ఏనుగంత
ఈ వితం జంటను చూడగవోతె
ముంతవాయెరా ముత్తయ్య
ముత్తయ్యతో నేజెప్పుతుంటే
చెంబువాయోరా చంద్రయ్య
చందయ్య్రతో నేజెప్పుతుంటే
గ్లాసువాయోరా గంగయ్య
గంగయ్యతో నేజెప్పుతుంటే
గిన్నెవాయెరా చెన్నయ్య
చెన్నయ్యతో నేజెప్పుతుంటే
లాగువాయెరా లస్మయ్య
లస్మయ్యతో నేజెప్పుతుంటే
అంగివాయెరా లింగయ్య
అన్ని వోతయని ఇంట్లో ఉంటే
ఉన్నవి దక్కెర ఊశెయ్య
Review పిల్లల ఆటపాటలు.