MCAకి అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్

మిలియన్ డాలర్ల మార్క్ దాటేస్తుందా ?

నాని, సాయిపల్లవి కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎంసీఏ’ సినిమాకు అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. నాని గత సినిమాలకు మించి ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్లుచెబుతున్నారు. విడుదలయి రెండు వారాలు కూడా కాకముందే మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటోంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 21న విడుదలయిన ఈ సినిమా.. అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఓ రోజు ముందుగానే అంటే.. డిసెంబర్ 20నే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు 9 లక్షల 43వేల 941 డాలర్లను కొల్లగొట్టింది. అంటే 6 కోట్ల 3లక్షల రూపాయలన్నమాట. ఈ వీకెండ్ నాటికి మిలియన్ డాలర్ల మార్కును దాటేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు తేల్చిచెబుతున్నారు.

Review MCAకి అమెరికాలో రికార్డ్ కలెక్షన్స్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top