ఇండియన్ సంస్థలపై విషం జిమ్మిన ఎంపీ

భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికన్‍ ఎంపీ డారెల్‍ ఇసా విషం చిమ్మాడు. హెచ్‍ 1 బీ వీసాల సిస్టంతో అవి ఆటలాడుతున్నాయని, ఈ పోగ్రాంలోని లోపాలను తమకు అనువుగా వినియోగించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్‍లో అట్లాంటిక్‍ కౌన్సిల్‍ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఈ వ్యవహారానికి సంబంధించి తాను ప్రతిపాదించిన బిల్లుకు తమ దేశ అధ్యక్షుడు ట్రంప్‍ సపోర్ట్నిస్తే సెనేట్‍లో మనకు గట్టి బలం
ఉంటుందని అన్నారు. భారతీయ సంస్థలు వీసా వ్యవస్థతో ఆటలాడుతున్నాయి.. లోపాలతో కూడిన మన ఇమ్మిగ్రేషన్‍ సిస్టంను తమ ప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నాయి అని డారెల్‍ విమర్శించారు. ఈ వీసా పోగ్రాంలో 75శాతం భారతీయ యజమాని (ఇండియా కంపెనీలకు)కి, ఇండియన్‍ ఆపరేటర్‍కు, భారతీయ ఉద్యోగికి వెళ్తోందని, అయితే ఇది తప్పుకాదని అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్‍ 1 బీ వీసా సిస్టంలో చిన్న మార్పు చేస్తేచాలన్నారు. మనకంటూ ఓ వ్యవస్థ ఉండాలి.. దేశంలో ఉన్న కొన్ని ఆంక్షలను ఎత్తేయాలని, ఇందుకోసం ఓ వేలం లాంటి పద్ధతి ఉండాలన్నారు. హెచ్‍ 1 బీ వీసా హ•ల్డర్ల వేతనాన్ని మరింత పెంచాలని డారెల్‍ సూచించారు. దీనివల్ల అమెరికాకు వచ్చే నిపుణుల శాతం కూడా పెరుగుతుందని చెప్పారు.

Review ఇండియన్ సంస్థలపై విషం జిమ్మిన ఎంపీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top