హ్యాపీగా జాలిగా యూరప్ టూర్

డే 1: లండన్
లండన్కు స్వాగతం. మీ ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కార్డ్ అన్నీ క్లియర్ చేసుకున్నాక, విమానాశ్రయం లోపల గల మీ గ్లోబల్ హాలీడూస్ టూర్ మేనేజర్ను కలవండి. మీ ప్లాన్ కార్డును చూపించి నేరుగా హో•ల్కు వెళ్లండి. అనంతరం సాయంత్రం లండన్లోని స్వామి నారాయణ టెంపుల్ను సందర్శించవచ్చు. ఇది ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మించిన భారతదేశం వెలుపలి అతి పెద్ద ఆలయం. తరువాత మంచి రాత్రి భోజనం.. రాత్రికి లండన్లో విశ్రమం.
డే 2: లండన్ సిటీ టూర్
అల్పాహారం తీసుకున్న తరువాత లండన్ నగర పర్యటన.. థేమ్స్ నదిపై చక్కగా తిరిగే ‘లండన్ ఐ’ సందర్శన. ఈ వీల్ నది మీదుగా 135 మీటర్ల ఎత్తున తిరుగుతూ ఉంటే ఆ సమయంలో కలిగే అనుభూతి చెప్పనలవి కాదు. అనంతరం స్టాప్ టవర్ బ్రిడ్జి, ట్రఫాల్గర్ స్క్వేర్, బకింగ్హామ్ ప్యాలెస్ వద్ద రాణి దర్శనం, పికాడిల్లీ సర్కర్, వెస్ట్ మినిస్టర్ అబ్బే తదితర చూడదగిన ప్రదేశాల మీదుగా పర్యటన సాగుతుంది. తరువాత ఇంగ్లిష్ చానల్ దాటి బ్రస్సెల్స్కు పయనం. అక్కడే రాత్రి బస.
డే 3: బ్రస్సెల్స్
అల్పాహారం తీసుకున్న తరువాత ప్రపంచ ప్రఖ్యాత మన్నెకిన్పిస్ విగ్రహం, గ్రాండ్ ప్లేస్ సందర్శన. ఆటోమియం పాదాల వద్ద ఉన్న మినీ యూరప్ (మినీయేచర్) సందర్శన. రెండు గంటల్లో యూరోప్ మొత్తాన్ని సందర్శించగల ఏకైక ఉద్యానవనం మినీ యూరోప్. సముద్రయానం ఎంతో ప్రత్యేకం. రాత్రి బస కోసం నెదర్లాండ్స్ పయనం.
డే 4: ఆమెస్టర్డామ్- కెనాల్ క్రూయిజ్
ఓలెండం ఫిషింగ్ గ్రామాన్ని సందర్శించడం ద్వారా ఈ రోజు ఉదయాన్ని ప్రారంభించండి. మార్కర్మీర్ సరస్సుపై ఉన్న డచ్ పట్టం ఓలోండం. రంగురంగుల చెక్కల ఇళ్లు, నౌకాశ్రయంలోని పాత ఫిషింగ్ బోట్లకు ఈ పట్టణం ప్రసిద్ధి. చీజ్ అండ్ క్లాగ్ ఫామ్ సందర్శన ద్వారా సమయాన్ని ఆస్వా దించవచ్చు. ప్రశాంతమైన కాలువ క్రూయిజ్ను ఆస్వా దించడానికి మాటలు చాలవు. ఈ దారిలో వచ్చే ప్రతి భవనం గొప్ప సమాచారాన్నిస్తుంది. రాత్రికి నెదర్లాండ్స్లో బస.
డే 5: హైడెల్బెర్గ్
జర్మనీలోని కొలోన్ నగరానికి పయనం.. ఆకట్టుకునే కొలోన్ కేథడ్రల్ చర్చి సందర్శన.. ఇది గోతిక్ శైలిలో నిర్మితమైంది. 1996లో దీనిని ప్రపంచ వారసత్వ కట్టడంగా ప్రకటించారు. ఇది జర్మనీలో అత్యధిక మంది సందర్శించే ప్రధాన పర్యాటక కట్టడం. లోపల విస్తారమైన అందాలను ఆస్వాదించవచ్చు. రోజుకు దాదాపు ఇరవై వేల మంది దీనిని సందర్శిస్తారు. అద్భుతమైనకట్టడానికి ఈ కేథడ్రల్ ఒక ఉదా హరణ. దీని నిర్మాణానికి ఆరు వందల (600) సంవత్సరాలు పట్టింది. జర్మనీలోనే ప్రసిద్ధ స్మారక కట్టడాలలో ఇదొకటి. తరువాత హైడెల్బెర్గ్ కోట సందర్శన. రాత్రికి జర్మనీలో బస.
డే 6: లేక్ టిటిసీ- రైన్ఫాల్స్- జ్యూరిచ్
బ్లాక్ ఫారెస్ట్ మధ్యలో ఉన్న టిటిసీ- న్యూస్టాడ్ట్ అనే పట్టణానికి పయనం.. దట్టమైన ఫిట్ వృక్షాలు, అద్భుతమైన శిఖరాలు, సున్నితమైన లోయల మధ్య బ్లాక్ ఫారెస్ట్ కనువిందు చేస్తుంది. టిటిసీలో అతిపెద్ద సహజ సరస్సు ఉంది. ఇది దాదాపు రెండు కిలోమీటర్ల మే విస్తరించి ఉంది. ఇక్కడి వింతైన వీధులు ఆశ్చర్యపరుస్తాయి. అందుకే ఇక్కడ కొంత సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ స్థానికంగా తయారైన కోకిల గడియారాల కోసం, వివిధ స్మారక చిహ్నాల కోసం షాపింగ్ చేయవచ్చు. తరువాత స్విట్జర్లాండ్కు వెళ్లి యూరప్లోని అతిపెద్ద సాదా జలపాతాలను, రిన్ జలపాతాన్ని సందర్శించవచ్చు. రాత్రి బస స్విట్జర్లాండ్లో.
డే 7: టిట్లిస్, లూసర్న్
ఈ రోజు పది వేల అడుగుల ఎత్తున ఉన్న టిట్లిస్ పర్వతారోహణ. టిట్లిస్ పర్వతాన్ని చుట్టి రావడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి రివాల్వింగ్ కేబుల్ కార్ను ఎక్కడం మరిచిపోలేని అనుభూతి. చుట్టుపక్కల గల స్విస్ ప్రకృతి దృశ్యాలు ఉత్కంఠను, ఆనందాన్ని కలిగిస్తాయి. టిట్లిస్ పర్వతం వద్ద మంచులో కొంత ఖాళీ సమయాన్ని గడపవచ్చు. ఐస్ గుహలను సందర్శించవచ్చు. తరువాత లూసర్న్కు పయనం. సింహం విగ్రహాన్ని, ఇక్కడి పురాతన చెక్క వంతెనలలో ఒకటైన చాపెల్ వంతెనను సందర్శించవచ్చు. లూసర్స్ సరస్సు అందాలను ఆస్వాదించడానికి కొంత సమయం గడపవచ్చు. స్విట్జర్లాండ్లో రాత్రికి బస.
డే 8: స్విట్జర్లాండ్-వాడుజ్-నార్డ్కెట్
యూరప్లోని అతి చిన్న దేశాలలో ఒకటైన లీచ్టెన్స్టెయిన్కు పయనం.. దీని రాజధాని నగరం వాడుజ్. అనంతరం సంస్క•తి, చరిత్ర, ప్రకృతి అందాల కలయికతో కూడిన ఆస్ట్రియాకు పయనం. ఆల్ఫస్ పర్వతశ్రేణిలో అతిపెద్దదైన నార్డ్కెట్పై నుంచి ఆల్ఫస్ అందాలను వీక్షించవచ్చు. ఇన్స్బ్రక్ పర్వతంపైకి తీసుకెళ్లే రైడ్ స్ప్రూస్ అడవులు, బెల్లం రాతి నిర్మాణాలు, అక్కడ గల ఇంటింటికి తీసుకెళ్తుంది. ఆస్ట్రియాలో రాత్రి బస.
డే 9: ఇన్స్బ్రక్- వెనిస్-సెయింట్ మార్కస్ స్క్వేర్
ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత హాఫ్బర్డ్ నగరంలో బంగారు పైకప్పు కవరింగ్ ఓరియంటేషన్ టూర్.. అనంతరం వెనిస్కు పయనం. ఇది విలక్షణమైన వాస్తు శిల్పం గల నగరం. ప్రసిద్ధమైన గొండోలా సవారీలతో కూడిన రొమాంటిక్ సిటీ. ప్రపంచంలోని అత్యంత సొగసైన చతురస్రాల్లో ఒకటైన సెయింట్ మార్కస్ స్క్వేర్కు పడవ ప్రయాణం.. ప్రఖ్యాత బ్రిడ్జ్ ఆఫ్ సిగ్స్, బాలిసికా డి శాన్ మార్కో సందర్శన.. మురాగో గ్లాస్ షోరూమ్ కూడా చూడదగినదే. ఇక్కడి గ్లాస్ వస్తువులను కొనకుండా ఉండ లేరు. చివరగా వెనిస్ అందాలను మొత్తం ఆస్వాదించా లనుకుంటే.. గొండోలా రైడ్ మాత్రం మరిచిపోకూడదు.
డే 10: వెనిస్-ఫ్లోరెన్స్ రోమ్
ఈ రోజు ఫ్లోరెన్స్కు పయనం. గైడ్ యొక్క మార్గదర్శనంలో ప్రపంచ స్థాయి కళలతో కనువిందు చేసే ఈ ప్రదేశాన్ని సందర్శించి తీరాలి. ఈ పునరుజ్జీవనోద్యమ నగరం యొక్క పర్యటన.. ఇటలీలోని కొన్ని అత్యుత్తమ చారిత్రాత్మక భవనాల ఆకట్టుకునే నిర్మాణ శైలులను చూడటం ద్వారా ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇటుక గోపురంగా పిలిచే డుయోమో ఆఫ్ ఫ్లోరెన్స్, బసిలికా ఆఫ్ శాంటాక్రోజ్, మైఖెలాంజిలో ఖనన స్థలం చూడదగ్గవి. ఇక, అక్కడక్కడ ఫొటో స్టాప్లు ఉంటాయి. రాత్రి బస కోసం రోమ్కు పయనం.
డే 11: రోమ్- వాటికన్- పిసా
ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రోమ్ నగర అందాలను నడుస్తూ ఆస్వాదించండి. గైడ్ సహాయం అవసరం. రోమ్.. ఇటలీ రాజధాని. అతి పెద్ద నగరం. కొలోస్పియం వద్ద ఫొటో స్టాప్తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. దీని చుట్టూ అనేక చూడదగ్గ సందర్శనీయ ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇటలీలోనే అత్యంత అంద•మైన ఫౌంటైన్లుగా పేర్గాంచినట్రెవి ఫౌంటైన్లు కూడా చూడవచ్చు. అనంతరం వాటికన్ నగర సందర్శన.. ఇక్కడి సెయింట్ పీటర్స్ బసిలికాను సందర్శించవచ్చు. రాత్రి బస కోసం పిసా పయనం.\
డే 12: పిసా- జెనీవా
ఈ రోజు పిజ్జా డెల్ బుయోమో మిమ్మల్ని ఆశ్చర్యపర్చడం ఖాయం. ఇది నాలుగు మతపరమైన నిర్మాణాలతో రూపుదిద్దుకుంది. డుయోమో, పిసా, బాప్టిస్టరీ, కాంపోసాంటో మత చిహ్నాలతో కూడినది పిసా టవర్. మీ కుటుంబం, స్నేహితుల కోసం స్మారక చిహ్నాలను కొనడానికి ఇక్కడ కొంత సమయాన్ని గడపాల్సిందే. రాత్రి పూట బస కోసం మధ్యాహ్నమే జెనీవాకు పయనం.
డే 13: గ్లేసియర్ 3000-మాంట్రియాక్స్, వెవే
ఈ రోజు కోల్ డల్పిలాన్ నుంచి సెసెక్స్ రూజ్ వరకు వైమానిక రోప్వేపై ప్రయాణించడం ఒక ప్రత్యేక అనుభూతి. పైన కనిపించే అందాలను 360 డిగ్రీల కోణంలో ఆస్వాదించవచ్చు. ఆల్ఫైన్ పర్వత శిఖరాలు, ఈగర్, మోంచ్, జంగ్ఫ్రావ్ నుంచి మాటర్హార్న్ వరకు 4000 మీటర్ల ఎత్తులో ఉన్న 24 శిఖరాలను సందర్శించవచ్చు. టిస్సాట్ వద్ద హిమానీనద నడక సాహసం ఉత్కంఠను తారస్థాయికి తీసు కెళ్తుంది. ఇది రెండు శిఖరాలను అనుసంధానించే ప్రపంచంలోనే మొదటి ఊగే వంతెన. భోజనం తరువాత మాంట్రియాక్స్ వెళ్లి జెనీవాకు తిరిగి వచ్చే ముందు ఈ కళాత్మక నగరానికి మరింత అన్వేషించడం అవసరం.
డే 14: జెనీవా- ప్యారిస్
ఈ రోజు సుందరమైన ప్యారిస్ నగర అందాలను వీక్షించడానికి బస్సులో ప్రయాణం.. దాదాపు ఆరు గంటల ప్రయాణం.. మధ్యలో సీన్ నది వద్ద క్రూయిజ్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈఫిల్ టవర్, మ్యూసీ డి ఓర్సే తదితర గొప్ప సందర్శనీయ ప్రాంతాలను చూసి ఆనందించడానికి ఈ క్రూయిజ్ పర్యటనను రూపొందించారు. రాత్రి బస ప్యారిస్లో.
డే 15: ఈఫిల్• టవర్- సిటీ టూర్
ఈ రోజు ఈఫిల్ టవర్ పై అంతస్తుకు పయనం.. ఫ్రాన్స్లోని అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నమిది. ఇది ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి. అలాగే, ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించిన కట్టడాలలో ఒకటి. ఈ టవర్ కొన నుంచి నగర అందాలను ఊపిరిబిగపట్టి చూడాల్సిందే. అలెగ్జాండర్ బ్రిడ్జి, ఆర్క్ డి ట్రియోంఫ్, కాంకోర్డ్ స్క్వేర్, ఒపెరా హౌస్, లెస్ ఇన్వాలిడ్స్, చాంప్స్ ఎలీసీస్ వంటి అనేక ప్రసిద్ధి కట్టడాలను ఈ టూర్ను కవర్ చేయొచ్చు.
డే 16: విమానంలో ఇంటికి..
ఈ రోజు మన పర్యటనలో చివరి రోజు. అమోఘమైన జ్ఞాపకాలను పోగుచేసుకుని తిరుగు పయనమయ్యే రోజు. హోటల్ షటిల్ ద్వారా విమానాశ్రయానికి చేరిక.
ఖీశీతీ ఎశీతీవ •వ••ఱశ్రీ•: •••.స్త్రశ్రీశీ••శ్రీష్ట్రశీశ్రీఱ••••.••

Review హ్యాపీగా జాలిగా యూరప్ టూర్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top