ఎన్నటికీ తిరిగి పొందలేనివి ఏమిటి

చంటిపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తారు ఎందుకు?
చిన్నారులకి స్నానం చేయించటమన్నది చాలా పెద్దపని. అందుకనే పసిపిల్లలకు అత్తగారో, అమ్మవంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తూ ఉంటారు. చిన్నా రులు స్నానం చేసే సమయంలో నీళ్ళు చెవుల్లోకి, ముక్కుల్లోకి వెళితే చంటి పిల్లవాడికి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళ మీద పడుకోబెట్టు కొని, గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తారు. స్నానానికి అరగంట ముందు పిల్లవాని ఒంటికి నూనె రాసి, మెత్తగా మసాజ్‍ చేసి మాడుకు ఆముదం పెట్టి, ఆ తరువాత నలుగు పిండితో స్నానం చేయించాలి. ఆవిధంగా కాళ్ళమీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడ్వరు. నలుగుపెట్టి, నూనె రాసి స్నానం చేయించటం ద్వారా చిన్నారులకు వ్యాయామం అవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది. భవిష్యత్తులో అందంగా, ఆరోగ్యంగా పెరుగుతారు.
జపం ఏయే ప్రదేశాల్లో చెయ్యాలి?
ఇంట్లో జపం ఎంత చేస్తే అంత ఫలితము ఉంటుంది. నదీ పరిసర ప్రాంతాల్లో జపం చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో జపం చేస్తే వందరెట్లు, యాగశాలలో జపం చేస్తే అంతకు మించి ఫలితం వస్తుంది.
పుణ్య ప్రదేశాల్లోనూ, దేవతా సన్నిధిలోనూ జపం చేస్తే 10 వేల రెట్లు ఫలితం వస్తుంది. శివాలయంలోగాని, శివసాన్నిథ్యంలో గాని జపం చేస్తే మహోన్నతమైన ఫలితం వస్తుంది. పులితోలు మీద కూర్చుని జపం చేస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు చాపపై కూర్చుని జపము చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాయి మీద కూర్చుని జపం చేస్తే రోగాలు, వస్తాయి. కటిక నేల మీద కూర్చుని జపం చేస్తే దు:ఖం సంభవిస్తుంది. కొయ్యపీట మీద కూర్చుని జపం చేస్తే దారిద్య్రం కలుగుతుంది. గడ్డి మీద కూర్చుని జపం చేస్తే కీర్తి నాశనము అవుతుంది.
అట్లతద్దినాడు అట్లు ఎందుకు పోస్తారు?
ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్దె మహిళలకు ఓ ముఖ్యమైన పండుగ. ఈ పండగ రోజు అట్లుపోస్తారు. అలా పోసే టప్పుడు అట్లుకు ఎన్ని రంధ్రాలు పడతాయో, అన్ని వేల సంవత్సరాలు తమకి అయిదోతనాన్ని ప్రసాదించమని గౌరిదేవిని ప్రార్థించటమే అట్లతద్దె ఆనవాయితి. అలాగే పెళ్ళికాని వారు ఈ అట్లతద్దె జరుపుకోవటం వల్ల తమకు వచ్చే వరుడు అందగాడు, చక్కటి సంతానం కలుగుతారని ఓ ప్రగాఢ విశ్వాసం. పడుచులకు అట్లతద్ది చాలా విశేషమైన పండుగ. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతవాసులు అట్లతద్ది పర్వాన్ని నేటికీ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు.
మసాలా దినుసులు ఆరగించడం మంచిదా? కాదా?
మిరియాలు రక్తాన్ని గడ్డ కట్టించవు. ఆకలిని పెంచుతాయి, లవంగం రక్తం గట్టిపడకుండా నిరోధిస్తుంది. అల్లం రక్తంలో ప్రమాదంగా మారే చెడు పదార్థాలను సరిచేస్తుంది. ఇక నీరుల్లిని ఎంత పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రక్తాన్ని నిరంతరం మన శరీరంలోనికి ప్రవహింప చేస్తుంది.
ఎన్నటికీ తిరిగి పొందలేనివి ఏమిటి?
భూతకాలము, విల్లు నుంచి బయటకు వచ్చిన బాణమూ పెదవి దాటిన వాక్కు, చేజారిన అవకాశమూ ఎప్పటికీ తిరిగిరావు, ఎన్నటికీ వాటిని పొందలేము కనుక కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే వాక్కుని ఆచి తూచి మాట్లాడితే ఎటువంటి అనర్థాలు జరగవు. అవకాశం చాలా తక్కువగా వస్తుంది. అప్పుడే దానిని సద్వినియోగ పరచుకోవాలి. దానిని దుర్వినియోగ పరచుకొని ఆ తరువాత అవకాశం కోసం ఎంత ఎదురుచూసినా మళ్ళీ అది రాకపోవచ్చును. అందుకే పెద్దలు అంటారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదని.
ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వారాన్ని ఎందుకు దర్శించాలి?
ముక్కోటి ఏకాదశినాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా శ్రీమహావిష్ణువుని దర్శిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. స్వామి నిద్ర లేచిన రోజున మొట్టమొదటిసారిగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారు మనసులో కోరుకున్న కోరిక ఎటువంటిదైనా విష్ణువు తప్పకుండా తీరుస్తాడని ఓ ప్రగాఢ నమ్మకం. అలాగే ముక్కోటి ఏకాదశినాడు ఎన్ని పనులున్నా వాటిని మానుకొని ఆ స్వామిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలూ దీవిస్తారు.

Review ఎన్నటికీ తిరిగి పొందలేనివి ఏమిటి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top