గల్ఫ్ టాలెంట్‍ సర్వే

మంచి చదువు, అందుకు తగిన ఉద్యోగం, దానికి తోడు మంచి జీతం.. ఇదీ నేటి యువత కోరుకునే కనీస అవసరంగా మారింది. ఒకరి కంటే ఎక్కువగా జీతం రావాలని కోరుకోవడం సహజమే. కానీ, ఆ ఎక్కువ అనేది భారీ రేంజ్‍లో ఉంటే.. యూఏఈ (యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్) యువత అదే ఆలోచనల్లో ఉంది. తమ దేశంలోని వలసదారుల కంటే 300 రెట్లు ఆదాయం జీతంగా రావాలని ఆ దేశపు యువత కోరుకుంటోందని గల్ఫ్ టాలెంట్‍ సర్వేలో తేలింది. వివిధ దేశాల్లో చదువుతున్న 300 మంది ఎమిరేట్‍ గ్రాడ్యుయేట్ల నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించిన అనంతరం ఫలితాలను ప్రకటించారు. ప్రస్తుతం యూఏఈ పౌరుడి సగటు జీతం 27 వేల దిర్హమ్స్ (4 లక్షల 88 వేల 439 రూపాయలు) కాగా, వలసదారులకు 9 వేల దిర్హమ్స్ (లక్షా 62 వేల 851 రూపాయలు) ఉంది. వలసదారులతో పోలిస్తే ఈ సగటు తగ్గరాదని గల్ఫ్ దేశాల యువత కోరుకుంటోందట.

Review గల్ఫ్ టాలెంట్‍ సర్వే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top