వెంకన్న దివ్యరూపం గురువారమే చూడాలి

మహిళలు దేవునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు?
దేవునికి సాష్టాంగ నమస్కారం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలనూ అనగా వక్షం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 నేత్రాలు, భూమిపై ఆన్చి నమస్కరించ వచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు పొట్ట నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది. అందుకే స్త్రీలను మోకా ళ్ళపై ఉండి నమస్కరించాలని పెద్దలు చెప్పారు.
చిన్న పిల్లలు పక్క ఎందుకు తడుపుతారు?
ఊహ తెలియని వయసులో ఏ విషయం గురించైనా చిన్నారులు భయపడడటం వలన, తల్లీ, తండ్రీ పోట్లాడుకోవటం చూడటం వల్ల, బాగా ఒత్తిడికి గురైనప్పుడు, అదే విషయం గురించి ఆలోచించటం వల్ల, అలాగే స్కూల్లో తోటి విద్యార్థులు ఆడుకొనే బొమ్మలు తన దగ్గర లేవని బెంగ పెట్టుకోవటం వంటి వాటి వల్ల కూడా పక్క తడుపుతారు. కనుక పిల్లల మనసు తెలుసుకుని ఎప్పటికప్పుడు వారిని అర్థం చేసుకుంటూ వారికి ధైర్యాన్ని, ప్రేమను రంగరిస్తే ఆ అలవాటుకు క్రమంగా దూరమవుతారు. చిన్నతనంలోనే తల్లీ, తండ్రీ ప్రేమ వారికెంతో అవసరం.
దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం
మన కంటుకుంటుందా?
ఖచ్చితంగా అంటుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే పొద్దున లేవగానే మనకు సమస్యలూ, బాధలూ అనేకం. ఇవేకదా దరిద్రానికి మూలకారణం. డబ్బులేని దరిద్రుడితో స్నేహం చేస్తే డబ్బునూ, విద్య లేనివాడితో స్నేహం చేస్తే విద్యను, సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారమూ మనకు తెలియకుండానే తరిగిపోతాయి. అందుకే ఏ విషయం లోనైనా, ఏ రంగంలోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చెయ్యాలి.
ఏ రోజున ఏ దేవుని పూజించాలి?
సోమవారం ఈశ్వరుడ్ని, మంగళవారం సుబ్రహ్మణ్వేశ్వర స్వామిని, హనుమంతుని, బుధవారం శ్రీమహావిష్ణువునూ, గురువారం నవగ్రహాలనూ, శ్రీషిర్డి సాయిబాబాను, శుక్ర వారం అమ్మవారినీ, శనివారం వెంకటేశ్వర స్వామినీ, ఆదివారం భానుడ్ని పూజించాలి.
వెల్లుల్ని రక్తాన్ని గడ్డకట్టించదా?
శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి. ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వీలయినంత ఎక్కువగా వెల్లుల్లి, నీరుల్లిపాయలను తీసుకోవడం గుండెకెంతో మంచిది.
గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేయాలా?
తల స్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ, క్రోధ, లోభ, మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా, పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు గనుక, కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాం. ఈ శరీరంలా మనసును శుచిగా, నిర్మలంగా ఉండేలా చేయా లన్న అర్థమే తలస్నాన భావం.
ఏ దేవతకి ఏం ఇష్టం?
వినాయకుడికి నివే దన, శివునకు అభిషేకం, అమ్మవారికి స్తోత్రము, విష్ణువుకి అలంకారం, సూర్యునకు నమస్కారం, గురువునకు శుశ్రూష ప్రియం. స్త్రీకి చీరలూ- నగలు, పురుషునికి ధనము- కీర్తి, పిల్లలకి ఆటలు-పా•లు, పెద్దవారికి ఆధ్యాత్మిక చింతన ఇష్టం.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదరక్షలు ఎందుకు అరుగుతున్నాయి?
వెంకటేశ్వరస్వామి వారి పాద రక్షలు చాలా పెద్దవి. అవి కాలంతో పాటే అరుగుతున్నా యి. దానికి కారణం శ్రీవెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ ఎక్కువ. శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తరువాత ఈ పాదరక్షలు ధరించి, ఏడుకొండలు దిగి అలివేలు మంగాదేవి వద్దకెళ్ళి మళ్లీ ఏడుకొండలు ఎక్కి తన యథాస్థానానికి సుప్రభాత వేళకి చేరు కుంటాడు. అందుకే అవి అరిగిపోతున్నాయని భక్తుల విశ్వాసం.
గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడ్ని మూడు రూపాలతో చూడవచ్చా?
గురువారం వెంకటేశ్వరస్వామి భక్తులకు మూడు రూపాలతో దర్శనం ఇస్తాడు. గురువారం ఉదయం రెండవ అర్చన అయిన తర్వాత వెంకటేశ్వరుడు నగలూ, అలంకరణలూ లేకుండా దర్శనమిస్తాడు. నొసటన సన్నని నామం ఉంటుంది. ఆ సమయంలో స్వామి వారి నేత్రాలను దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాలసేవ తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తారు. అనగా గురువారం ఉదయం సకలాభర ణాలతోనూ, రెండో అర్చన తర్వాత నగలు లేకుండా, రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనం చేసుకోవచ్చు.

Review వెంకన్న దివ్యరూపం గురువారమే చూడాలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top