యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు

ఇంటర్‍నెట్‍లో టెలివిజన్‍ కార్యక్రమాలను చూసే యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని, రానున్న కాలంలో ఇది ఇంకా అధికమయ్యే వీలుందని ఆన్‍లైన్‍ టీవీ ఛానెళ్ల స్ట్రీమింగ్‍ వేదిక యప్‍టీవీ వ్యవస్థాపకుడు, ముఖ్యకార్య నిర్వహణాధికారి (సీఈఓ) ఉదయ్‍ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంస్థ నూతన ప్రచారకర్తగా మహేష్‍బాబును నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్నెట్‍ ఆధారంగా పనిచేసే ఏ పరికరంలోనైనా టీవీ చూసేందుకు అవకాశం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమాలు ప్రసారం అయిన తర్వాత వారం రోజులపాటు ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మన దేశంలో వీక్షకులు రూ.99, విదేశాల్లో వారైతే 15-20 డాలర్ల వరకూ చెల్లించి దాదాపు 300 వరకూ దక్షిణాసియా ఛానెళ్లను, 5,000 వరకూ సినిమాలను చూసేందుకు అవకాశం ఉందన్నారు. కొత్త సినిమాలు విడుదలైన 4 వారాల తర్వాత ‘పేపర్‍ వ్యూ’ ద్వారా విదేశాల్లో ఉన్నవారికి అందుబాటులోకి తెస్తున్నట్లు సిఈఓ ఉదయ్‍ రెడ్డి తెలిపారు.

Review యప్‍టీవీకి ప్రచార కర్తగా మహేష్‍బాబు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top